క్రికెట్, రాజకీయాలు రెండు కళ్లు, అసదుద్దీన్‌పై పోటీపై అజహరుద్దీన్ ఏం చెప్పారంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకొంటానని మాజీ ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ చెప్పారు. క్రికెట్, రాజకీయాలు తనకు రెండు కళ్ళ వంటివని ఆయన చెప్పారు.అసదుద్దీన్‌పై తాను పోటీ చేస్తాననే విషయంలో వాస్తవం లేదని అజహర్ స్పష్టం చేశారు.

సుమన్ సవాల్‌‌కు రేవంత్ సై: జనవరి 12న, చర్చకు రెఢీ, ఎవరు ముక్కు రాస్తారో చూద్దాం

హెచ్ సి ఏ లో ఇటీవల చోటు చేసుకొన్న ఘటనలపై అజహరుద్దీన్ మీడియా ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. హెచ్ సి ఏ క్రికెట్ ను నిర్లక్ష్యం చేసిందని అజహరుద్దీన్ ఆరోపించారు. హెచ్ సి ఏ ప్రస్తుత కార్యవర్గం తక్షణమే రాజీనామా చేయాలి అజహరుద్దీన్ డిమాండ్ చేశారు.

తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, విద్యుత్‌పై చర్చకు నేను రెఢీ: రేవంత్‌కు సుమన్ సవాల్

పూర్తి కాలం రాజకీయ నేతగా తాను కొనసాగుతున్నట్టు చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు అజహరుద్దీన్ ప్రకటించారు. అయితే పార్టీ ఆదేశం ప్రకారం నడుచుకొంటానని ఆయన చెప్పారు.

క్రికెట్, రాజకీయాలు రెండు కళ్లు

క్రికెట్, రాజకీయాలు రెండు కళ్లు


క్రికెట్, రాజకీయాలు తనకు రెండు కళ్ళ వంటివని మాజీ టీమిండియా కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడినని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని చెప్పారు. పార్టీ నాయకత్వం ఆదేశాల ప్రకారంగా 2019 ఎన్నికల్లో నడుచుకొంటానని ఆయన చెప్పారు.

యూపీ నుండి తెలంగాణకు వస్తానని ఇప్పుడే చెప్పలేను

యూపీ నుండి తెలంగాణకు వస్తానని ఇప్పుడే చెప్పలేను


అజహరుద్దీన్ గతంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు. అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుండి అజహరుద్దీన్ పోటీ చేస్తారా, యూపీ నుండి పోటీ చేస్తారా అనే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రానున్న రోజుల్లో యూపీ నుండి తెలంగాణకు వచ్చే విషయమై తనకు ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు చోటు చేసుకొంటాయో ఇప్పుడే చెప్పలేనని అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు.

అసదుద్దీన్ పై పోటీ చేస్తాననేది తప్పుడు ప్రచారం

అసదుద్దీన్ పై పోటీ చేస్తాననేది తప్పుడు ప్రచారం


అసదుద్దీన్ ఒవైసీపై తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాననేది తప్పుడు ప్రచారమని అజహరుద్దీన్ కొట్టిపారేశారు. తనకు ఆ ఆలోచన లేదని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో కూడ తనకు తెలియదని చెప్పారు. అయితే పార్టీ ఆదేశాల ప్రకారంగా తాను నడుచుకొంటానని అజహరుద్దీన్ చెప్పారు.

తెలంగాణలో ప్రచారం చేస్తా

తెలంగాణలో ప్రచారం చేస్తా


తెలంగాణలో కూడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్టు అజహరుద్దీన్ చెప్పారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చర్చించారని ఆయన చెప్పారు. అయితే ఏదైనా కూడ పార్టీ ఆదేశాల ప్రకారంగానే వ్యవహరించనున్నట్టు అజహరుద్దీన్ చెప్పారు. హెచ్ సి ఏను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Indian Cricket team captain Azhar said that there was no truth on rumor that he would contest against Asaduddin in 2019 elections. Iam not interest to contest against Asaduddin in 2019 elections he said.Former Cricketer Mohammad Azharuddin spoke to media at hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి