సుమన్ సవాల్‌‌కు రేవంత్ సై: జనవరి 12న, చర్చకు రెఢీ, ఎవరు ముక్కు రాస్తారో చూద్దాం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విద్యుత్‌పై బహిరంగ చర్చకు టిఆర్ఎస్ సవాల్ కు కాంగ్రెస్ స్పందించింది. తాము చెబుతన్న అంశాలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు.జనవరి 12వ, తేదిన రెండు గంటలకు విద్యుత్ పై బహిరంగ చర్చకు తాను కూడ సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే వేదికను నిర్ణయించాలని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ను కోరారు రేవంత్ రెడ్డి.

తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, విద్యుత్‌పై చర్చకు నేను రెఢీ: రేవంత్‌కు సుమన్ సవాల్

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దివాళా కంపెనీలతో ఒప్పందాలు, మాట వినలేదని ఐఎఎస్‌లను తప్పించారు: కెసిఆర్‌పై రేవంత్ సంచలనం

అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై టిఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ సీఎం కెసిఆర్ ముందుచూపు కారణంగా తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతోందని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రకటించారు.

ఇతర పార్టీల సీనియర్లంతా మాతో టచ్‌‌లో, సంక్రాంతి తర్వాత కొత్త పీసీసీ కమిటీ: ఉత్తమ్

టిఆర్ఎస్ సవాల్‌కు కాంగ్రెస్ నేత రేవంత్ సై

టిఆర్ఎస్ సవాల్‌కు కాంగ్రెస్ నేత రేవంత్ సై


విద్యుత్ ఒప్పందాలు, నిరంతర విద్యుత్ తదితర అంశాలపై బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్ననని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 12వ, తేదిన మధ్యాహ్నం రెండు గంటలకు చర్చకు రెడీ ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే బహిరంగ చర్చకు వేదికను నిర్ణయించాలని బాల్క సుమన్ కు సూచించారు రేవంత్ రెడ్డి.ప్రగతి భవన్ , టిఆర్ఎస్ భవన్ కు కూడ వచ్చేందుకు సిద్దమేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ముక్కు ఎవరు రాయాలో ప్రజలు నిర్ణయిస్తారు

ముక్కు ఎవరు రాయాలో ప్రజలు నిర్ణయిస్తారు


విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎవరు మాట్లాడుతుంది కరెక్టో, తప్పో , ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారని అని రేవంత్ రెడ్డి దీటుగా ప్రతి స్పందించారు.

కెసిఆర్ చీకటి ఒప్పందాలు

కెసిఆర్ చీకటి ఒప్పందాలు

తెలంగాణ ముఖ్యమంత్రి విద్యుత్ కొనుగోళ్ళలో చీకటి ఒప్పందాలను చేసుకొన్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.కేసీఆర్ త‌మ‌కు వ‌చ్చే కమీషన్‌ పైనే శ్ర‌ద్ధ చూపుతున్నార‌ని ఆరోపించారు. తక్కువ ధరకే విద్యుత్‌ ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్నప్ప‌టికీ కేసీఆర్ చ‌త్తీస్‌గఢ్‌తో క‌మీష‌న్ల కోస‌మే ఒప్పందాలు చేసుకున్నార‌ని అన్నారు

సంపత్‌కుమార్, శ్రవణ్‌కుమార్ కూడ వస్తారు

సంపత్‌కుమార్, శ్రవణ్‌కుమార్ కూడ వస్తారు

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో చీకటి ఒప్పందాలు చేసుకొందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై టిఆర్ఎస్ కూడ త్రీవంగా ప్రతిస్పందించింది. రేవంత్ ను బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరింది. ఈ సవాల్ కు రేవంత్ సిద్దమేనని ప్రకటించారు. టిఆర్ఎస్ చేసుకొన్న చీకటి ఒప్పందాలను ప్రజల ముందు బయటపెట్టనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ చర్చకు తనతో పాటు దాసోజు శ్రవణ్ కుమార్, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడ వస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Revanth Reddy responded on Trs Mp Balka Suman challenge on electricity issue.I'm ready to come open debate on electricity issue said Revanth Reddy

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి