మోడీ సమక్షంలో బీజేపీలోకి!: రేవంత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసముందని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అందుకే బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అందుకే బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకుంటే.. అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.
ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందన్నారు.

కాంగ్రెస్ పనైపోయిందంటూనే రేవంత్ రెడ్డిపై కొండా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పనైపోయిందంటూనే రేవంత్ రెడ్డిపై కొండా కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం ప్రజలు సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందన్నారు. తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చారన్నారు. సకాలంలో రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చుంటే తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాడినని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

తెలంగాణలో బీజేపీదే అధికారమన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణలో బీజేపీదే అధికారమన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి శూన్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా హుజూరాబాద్ ఫలితాలే వస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు.

మోడీ సమక్షంలో బీజేపీలో చేరతా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోడీ సమక్షంలో బీజేపీలో చేరతా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీ పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తాను పదవులు ఆశించి బీజేపీలోకి వెళ్లడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. జులై 2 లేదా 3న ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. తాను ఎంపీ పదవికే సరిపోతానని.. తనకు అదే ఆసక్తి వెల్లడించారు. ఎమ్మెల్యేగా పోటీచేయమని అధిష్ఠానం చెబితే చేస్తానన్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులను మర్యాదపూర్వకంగానే కలిశానని, వారు శుభాకాంక్షలు చెప్పారని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+