వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతా... టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు...

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే వాటిని మరిచిపోతున్నారని... కాబట్టి ఏడాది పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాలని ఉందన్నారు. తిరిగి ఎన్నికలు జరిగే ఏడాది వాటిని మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడారు.

Recommended Video

తెలంగాణ ప్రజల గురించి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

జనం మంచివారు అనుకోవాలో,అమాయకులు అనుకోవాలో అర్థం కావట్లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మేలు వారికి తెలియట్లేదన్నారు. ఎంతోమంది ప్రజలు పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. '24 గంటల ఉచిత విద్యుత్ కాకుండా కేవలం 3 లేదా గంటల విద్యుత్ ఇవ్వాలని కోరుతా... సంక్షేమ పథకాలను నిలిపివేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది...' అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో లక్ష్మారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎంత మంచి చేసినా తమను విస్మరిస్తున్నారన్న ఆవేదన ఆయన మాటల్లో ధ్వనించింది.

i will ask cm kcr to stop welfare schemes former minister laxmareddy sensational comments

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ విధానాల్లో ముందున్నప్పటికీ నిరుద్యోగుల పట్ల అలసత్వం వంటి కారణాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచేవిగా మారాయి. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాభవం వెనుక నిరుద్యోగ యువత ఆగ్రహం ఉందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత టీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది ముమ్మాటికీ నిజం. నీళ్లు,నిధులు,నియామకాలు అన్న నినాదంతో ఏర్పడిన తెలంగాణలో నియామకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఇప్పటికీ చాలామంది నిరుద్యోగులు అపనమ్మకాన్నే వ్యక్తపరుస్తున్నారు. జోనల్ వ్యవస్థ ఓ కొలిక్కి రాకుండా నోటిఫికేషన్లు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు,కార్పోరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది కేవలం ఎలక్షన్ స్టంటేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో ప్రభుత్వ ప్రకటన ఆశలు రేకెత్తిస్తోంది.

English summary
Former minister Laxma Reddy said people are easily forgetting the benifits they getting from government.So that he will be ask CM KCR to stop welfare schemes and restart them in elections year,Laxmareddy added.As TRS defeated in Dubbaka and GHMC Laxmareddy made this comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X