అధ్యక్ష పదవి ఇవ్వండి...! పార్టీని అధికారంలోకి తెస్తా... ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవికి పోటిపడుతున్నారు. కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని పార్టీ అధ్యక్షున్ని మారుస్తారని ఉహాగానాలు జోరందుకున్న నేపథ్యంలోనే తాను సైతం పోటీలో ఉన్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని విజ్ఝప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నేతలకు ధరఖాస్తు కూడ పెట్టుకున్నట్టు చెప్పారు. ఢిల్లీలో జరగనున్న పార్టీ సమావేశానికి తన బయోడేటాను కూడ పంపినట్టు జగ్గారెడ్డి తెలిపారు.

 హుజర్‌నగర్ ఎన్నికతో పీసీసీ మార్పు

హుజర్‌నగర్ ఎన్నికతో పీసీసీ మార్పు

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం కావడంతో కాంగ్రేస్ పార్టీకి, కొత్త నాయకత్వంతో జవసత్వాలు నింపాలని హైకమాండ్ భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోనేందుకు గట్టి నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్థుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే యోచనలో పార్టీ హైకమాండ్ సంకేతాలను పంపింది. అయితే రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ నేతలు తెలిపారు. ఆ తర్వాతే పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి.

టీపీసీసీపై కన్నెసిన పార్టీ సీనియర్లు

టీపీసీసీపై కన్నెసిన పార్టీ సీనియర్లు

దీంతో పార్టీ అధ్యక్షుడిపై పలువురు పార్టీ సీనియర్ నేతలుకన్నేశారు. ఇప్పటి నుండే ఆ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ అధ్యక్షున్ని మార్చితే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్‌ను కోరారు.

ఇందుకోసం ఈనెల పదహరున ఏఐసీసీ ముఖ్యనేతల సమావేశం ఉండడంతో తన బయోడేటాను పంపినట్టు తెలిపారు. కమిటీతోపాటు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కూడ తన ఆకాంక్షను తెలిపినట్టు చెప్పారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తానని అన్నారు. ఇక ఆయనవద్ద పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అద్బుతమైన మందు ఉందని చెప్పారు. అయితే అవసరమైప్పుడే దాన్ని బయటకు తీస్తానని జగ్గారెడ్డి చెప్పారు.

ఇది వరకే రేవంత్ అధ్యక్షుడంటూ ప్రచారం

ఇది వరకే రేవంత్ అధ్యక్షుడంటూ ప్రచారం

కాగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే.. ఆ పార్టీలో కొనసాగుతున్న నేతలకు స్వేచ్చతోపాటు అధిష్టానం కనికరిస్తే ఎంతటి స్థానంలోనైనా కూర్చోబెడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, బహిరంగ విమర్శలు...అవసరమైతే ఒకరికొకరు దాడులు చేసుకోవాడాలు కూడ సాధరణంగా ఉంటాయి. కాగా పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటిక ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబంతో ఢిల్లీ వెల్లి అగ్రనేతలను ప్రసన్నం చేసుకుని వచ్చారు. దీంతో అప్పుడే రేవంత్ రెడ్డికి పీసీసీ ఖారారు అయిందని ప్రచారం జరిగింది. ఇక రేవంత్ రెడ్డితో తాజాగా జగ్గారెడ్డి కూడ తన మనసులోని కోరికను చెప్పారు. రేవంత్ రెడ్డితోపాటు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శలు చేస్తున్న వారిలో జగ్గారెడ్డి కూడ ముందే ఉన్నారు. మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+