నేను వైఎస్ అభిమానిని, ఆత్మగౌరవయాత్ర చేస్తా: మల్లు భట్టి విక్రమార్క

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయం తీసుకొంటుంది, అప్పటివరకు రాష్ట్ర అభివృద్ది ఆగకూడదనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిప్రాయంగా ఉండేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చేపట్టిన పథకాలకు తాను ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ఇప్పటికీ ఆయన అభిమానినే అని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

ఓ తెలుగు టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లు భట్టి విక్రమార్క పలు విషయాలపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మట్లు భట్టి విక్రమార్క స్పందించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసమే తాను పనిచేస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం వైఎస్ఆర్ ఇలా

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం వైఎస్ఆర్ ఇలా

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికొంటే రాష్ట్ర విభజన జరిగి ఉండకపోయేదనే అభిప్రాయాలపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంటుంది. అయితే అప్పటి వరకు రాష్ట్ర విభజన ఆగకూడదనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిప్రాయంగా ఉండేదని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

ఆత్మగౌరవ యాత్ర చేస్తా

ఆత్మగౌరవ యాత్ర చేస్తా

తెలంగాణ రాష్ట్రం ఏ ప్రజల కోసం ఏర్పాటు చేశారో ఆ ప్రజల ఆత్మగౌరవం కోసం యాత్ర చేస్తానని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అయితే ఈ యాత్రకు పార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదనే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. తాను యాత్ర ఎప్పుడు యాత్ర చేస్తానో ఇంకా నిర్ణయించలేదని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.అయితే సమయం వచ్చినప్పుడు యాత్ర ఎప్పుడు ప్రారంభించనున్నామో ఆయన ప్రకటించారు.

నాకు ఏ వర్గం లేదు

నాకు ఏ వర్గం లేదు

కాంగ్రెస్ పార్టీలో తనకు ఏ వర్గం లేదని మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కోసం తాను కృషి చేస్తానని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తాను ఏం మాట్లాడిన కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతానని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

ఏ ఉద్యమాన్ని మద్యలో వదిలేయలేదు

ఏ ఉద్యమాన్ని మద్యలో వదిలేయలేదు

ఏ ఉద్యమాన్ని మద్యలో వదిలేయలేదని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మంలో రైతాంగం సమస్య విషయంలో తాము చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం పెరుగుతోందా

రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం పెరుగుతోందా

కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని మల్లు భట్టి విక్రమార్క తోసిపుచ్చారు. పార్టీ అవసరాల రీత్యా అన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొంటారని ఆయన చెప్పారు. అయితే పార్టీ వేదికల్లో తమ అభిప్రాయాలను తాము చెబుతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఇతర సామాజికవర్గాలకు కూడ పదవులు కూడ పార్టీ నాయకత్వం కట్టబెట్టనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will conduct Atmagourava yaatra soon said Tpcc working president Mallu bhattivikramarka. A telugu news channel interviewed him on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి