కారణమిదే: ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్గొండ అసెంబ్లీకి బొడ్డుపల్లి లక్ష్మి?

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుండి ఎంపీగా పోటీ చేయనున్నట్టు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ ఎస్ అబ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసేందుకు విస్తృతంగా పర్యటించనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.మరోవైపు నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి బొడ్డుపల్లి లక్ష్మిని బరిలోకి దింపే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచినా అసెంబ్లీలో అడుగుపెట్టను: జగదీష్ రెడ్డి సంచలనం

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి 1999 నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి నల్గొండ మున్సిఫల్ ఛైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిని బరిలోకి దింపే అవకాశం ఉంది.

సర్వే ఎఫెక్ట్: టిఆర్ఎస్‌కు ఇలా చెక్, కెసిఆర్‌కు దెబ్బేనా?

దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య తర్వాత నల్గొండ రాజకీయాలు మరింత హట్‌ హట్‌గా మారాయి.

నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా

నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా

2019 ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

నల్గొండ నుండి బొడ్డుపల్లి లక్ష్మిని బరిలోకి

నల్గొండ నుండి బొడ్డుపల్లి లక్ష్మిని బరిలోకి

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బొడ్డుపల్లి లక్ష్మిని బరిలోకి దింపాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావిస్తున్నారు ఈ ఏడాది జనవరి చివరి వారంలో కాంగ్రెస్ పార్టీ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు టిఆర్ఎస్ నేతలే కారణమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై సిబిఐ విచారణ జరిపించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేయించారు. మరో వైపు 2019 ఎన్నికల్లో బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య బొడ్డుపల్లి లక్ష్మిని నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపడం వల్ల సానుభూతి ఓట్లు కలిసొచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావిస్తున్నారు.

 నల్గొండలో పార్టీల బలబలాలివే

నల్గొండలో పార్టీల బలబలాలివే

2014 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో దేవరకొంద అసెంబ్లీ స్థానం నుండి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్రకుమార్ విజయం సాధించారు. నాగార్జున‌సాగర్ నుండి జానారెడ్డి విజయం సాధించారు. మిర్యాలగూడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా భాస్కర్ రావు పోటీ చేసి విజయం సాధించారు. హూజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుండి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి , నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , సూర్యాపేట నుండి టిఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధఇంచారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ఉన్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్‌లో చేరారు. దేవరకొండలో సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడ సిపిఐని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

 ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్న టిఆర్ఎస్

ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్న టిఆర్ఎస్

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా నల్గొండ జిల్లా నుండే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.దీంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు నల్గొండ నుండి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. నల్గొండ టిడిపి ఇంచార్జీగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డిని టిఆర్ఎస్‌లో చేర్చుకొంది. గత ఎన్నికల్లో భూపాల్ రెడ్డి స్వతంత్రఅభ్యర్థిగా పోటీచేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ప్రస్తుతం టిఆర్ఎస్ నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీగా కంచర్ల భూపాల్ రెడ్డి కొనసాగుతున్నారు.. ఇతర పార్టీలకు చెందిన కీలకమైన నేతలను టిఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. జానారెడ్డికి ముఖ్యమైన అనుచరులు కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు .

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nalgonda MLA Komatireddy Venkat Reddy said that he will contest from Nalgonda parliment segment in 2019 elections. He announced in congress party meeting held at Vemulapally mandal on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి