అంతర్యుద్ధం: సీఎంలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, ఓటుకు నోటు స్పందిస్తా, ఏం చెప్తారు?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8తో ఇరు తెలుగు రాష్ట్రాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పవన్ వరుస ట్వీట్లు చేశారు. తాజాగా మరోసారి స్పందించారు.
'తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అంటార'ని అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలని నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయని హెచ్చరించారు.

ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను మరో రెండు రోజుల్లో పెదవి విప్పుతానని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను ఈ వారంలో లేదా రానున్న వారంలో గానీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానని మరో ట్వీట్ చేశారు.
నాయకుడి పాలన ప్రభావం ప్రతి అంశం పైన ఉంటుందని మన పెద్దవారు చెప్పారని, మన నాయకులు మనలను ఎలా ముందుకు తీసుకు వెళ్తారో ముందు ముందు చూద్దామని ట్వీట్ చేశారు. కాగా, రెండ్రోజుల్లో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుతున్న పవన్ ఏం మాట్లాడుతారో అనే చర్చ సాగుతోంది.
'తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు' అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో,మాటలుతో ప్రభుత్వాలని నడిపితే
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2015 'భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి'.
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2015 I will express my views on Cash-for- Vote case, Phone- tapping and on Section 8 in the next two days.
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2015 If it is needed I might call for a press meet by the end of this week or in the beginning of next week.
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2015 Elders say,'Everything depends on the wisdom of the Ruler' and let's see how our leaders wisdom take us forward in the near future.
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2015 











Click it and Unblock the Notifications