టీఆర్ఎస్‌లోనే ఉంటా, కేసీఆర్ మాటే నా బాట: స్పష్టం చేసిన హరీష్ రావు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన పుట్టుక గానీ చావు గానీ టీఆర్ఎస్‌లోనే అని మంత్రి హరీష్ రావు శుక్రవారం స్పష్టం చేశారు. తన విషయంలో ఇలాంటి ఊహాగానాలు, ఆలోచనలు ఎవరు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాంటివి ఊహకే రావొద్దని అభిప్రాయపడ్డారు.

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాను డీజీపీని కోరానని చెప్పారు. కేసీఆర్ మాటే నా బాట అని చెప్పారు.

 I will not join BJP, will remain TRS, says Harish Rao

ఆయన ఇంకా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు స్పందన లేదన్నారు. వారు అనవసరంగా తమ పార్టీపై నోరు పారేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఏ యాత్ర చేసినా అధికారంలోకి వచ్చేది తమ పార్టీయే అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఉద్యమం సమయంలో త్యాగాలకు కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసిందని చెప్పారు. కాంగ్రెస్ పెండింగు ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister Harish Rao on Friday condemned joining Bharatiya Janata Party. He said he will remain TRS.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి