సమంత తేల్చి చెప్పేసారు - ఇతర వదంతుల్లా ఇదీ నిజం కాదు : అక్కడే అసలు ట్విస్టు..!!
నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నారా..వారిద్దరు విడిపోవటం ఖాయమా..అందుకు ముహూర్తం సైతం ఖరారైందా..కొంత కాలంగా జోరుగా సాగుతున్న ప్రచారం ..టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రశ్నలు. జాతీయ మీడియా సైతం ఈ అంశం పైన స్పష్టత లేక అందుతున్న సమాచారంతో పలు కధనాలు ప్రసారం చేస్తోంది. కొంత కాలంగా నాగ చైతన్య- సమంత మధ్య సరైన సంబంధాలు లేవనే సంకేతాలు కనిపిస్తుండటంతో వారిద్దరూ విడిపోవటం ఖాయమనే ప్రచారం మొదలైంది.

చర్చ మొదలైంది అక్కడే
సమంత సోషల్ మీడియా అకౌంట్ ఖాతాల్లో తన పేరు పక్కన అక్కినేని అనేది తీసేయటంతో ఈ చర్చ మొదలైంది. అదే విధంగా నాగ చైతన్య తాజాగా నటించిన లవ్ స్టోరీ మూవీకి సంబంధించి హీరోయిన్ సాయి పల్లవికి సమంత ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ, నాగచైతన్య పేరు ప్రస్తావించలేదు. ఇక, లవ్ స్టోరీ సక్సెస్ వేడుకల్లోనూ నాగ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నా..సమంత కనిపించ లేదు. తాజాగా..సమంత తిరుమల శ్రీవారి దర్శనం కు వచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులు నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం పైన ప్రశ్నించగా..సమంత సీరియస్ అయ్యారు.

ప్రకటనకు ముహూర్తం ఖరారైందంటూ
ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు ఏంటంటూ ఫైర్ అయ్యారు. సమంత చేస్తున్న వెబ్ సిరీస్ ఆపేసి..అమల తాగా ఇంట్లోనే ఉండాలని కుటుంబ సభ్యులు కోరారని.. అందుకు సమంత నిరాకరించారనే వాదన వినిపించింది.ఇక, ఇప్పటికే నాగచైతన్య - సమంత మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయిందని..ఇద్దరికీ ఇప్పటికే కౌన్సిలింగ్ చేసినా వారిద్దరి మధ్య సయోధ్య కాలేదనే ప్రచారం సాగింది. ఇక, అక్టోబర్ 7న వారి వివాహ వార్షికోత్సవం ఉండటంతో అదే రోజున సమంత - నాగ చైతన్య తమ వివాహ బంధం పైన వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వటంతో పాటుగా..ఒక ప్రకటన చేస్తారనే సమాచారం బయటకు వచ్చింది.

సమంత తాజాగా మరింత క్లారిటీతో
అయితే, సమంత-నాగచైతన్య ఇద్దరూ విడాకుల అంశం పైన నేరుగా సమాధానం చెప్పలేదు. నాగ చైతన్య మాత్రం పరోక్షంగా దీని పైన స్పందిస్తూ.. వ్యక్తిగతంగా కొంత బాధ కలిగించే విషయయే అయినప్పటికీ, టీఆర్పీల కోసం సృష్టించేవి ఎక్కువ రోజులు ప్రజల మనస్సులో ఉండవని, ఏది నిజమో అదే ఉంటుందంటూ తాజాగా కామెంట్ చేసారు. 'సాకి' బ్రాండ్‌తో వస్త్రరంగ వ్యాపారంలో ప్రవేశించిన సమంత, 'సాకి' ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. '

హైదరాబాద్ లోనే ఉంటానంటూ
మీరు ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా?' అని ఒకరు ప్రశ్నించగా... ''నాకు నిజంగా తెలియదు! ఈ వదంతులు ఎక్కడ ప్రారంభమవుతాయో? ఇతర వదంతుల్లా ఇదీ నిజం కాదు. హైదరాబాద్ నా ఇల్లు. ఎప్పటికీ నా ఇల్లుగానే ఉంటుంది. హైదరాబాద్ నాకు ఎంతో ఇచ్చింది. చాలా సంతోషంగా ఇక్కడే జీవిస్తా'' అని సమంత చెప్పారు. కానీ, తాను హైదరాబాద్ లో ఉంటానని చెప్పటం ద్వారా..తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవనే చెప్పే ప్రయత్నం సమంత చేసారనే వాదన వినిపిస్తోంది.
Recommended Video

కలిసే ఉంటారా.. సమంత వ్యాఖ్యల వెనుక
అదే సమయంలో హైదరాబాద్ లో ఉండటం గురించి అంత స్పష్టంగా చెప్పిన సమంత..నాగ చైతన్యతో కలిసి వైవాహిక జీవితం కొనసాగించటం పైన క్లారిటీ ఇచ్చి ఈ ప్రచారానికి ఎందుకు ముగింపు ఇవ్వలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇటు సమంత-అటు నాగ చైతన్య ఇద్దరూ పరోక్షంగా ప్రచారాన్ని తప్పు బడుతున్నారు. కానీ, స్పష్టంగా ఖండించటం లేదు. అదే సమయంలో సమర్దించటం లేదు. దీంతో..వీరిద్దరి విషయంలో జరుగుతన్న ప్రచారం పైన అక్టోబర్ 7వ తేదీనే స్పష్టత వస్తుందనే వాదన ఎంత వరకు నిజం అవుతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications