• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ మాట కోసమే టిడిపిని వీడాను, చంద్రబాబు, కెసిఆర్ కూడ ఆహ్వనించారు:జీవన్ రెడ్డి

By Narsimha
|

హైదరాబాద్: ఇచ్చిన మాట కోసమే టిడిపి నుండి బయటకు రావాల్సివచ్చిందని మాజీ మంత్రి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ,జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు.చంద్రబాబునాయుడు కూడ తనను పార్టీలోకి ఆహ్వనించారని, అయితే ఒక్కసారి పార్టీమారే తప్పుచేశానని అందుకే పార్టీ మారలేదన్నారు జీవన్ రెడ్డి.

ఓపెన్ హర్ట్ విత్ ఆర్ కె పేరుతో ఎబిఎన్ ఛానల్ జీవన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో పార్టీ మారేందుకు దారితీసిన పరిస్థితులతోపాటు తాజా రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు. రాజకీయపబ్బం గడుపుకొనేందుకు ఆ పార్టీ అధినేత వ్యవహరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు. కెసిఆర్ తరహలో ప్రజలను బురిడీ కొట్టించే మాటలను తాము చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

పదే పదే పార్టీలను మార్చడం తనకు నచ్చదని చెప్పారు. టిడిపి నుండి బయటకు రావడం ఇచ్చిన మాటకు కట్టుబడేనని ఆయన చెప్పారు. అయితే మరోసారి అవకాశం వచ్చినా టిడిపిలో చేరలేదన్నారు బాబు.

ఆ మాటకు కట్టుబడే టిడిపిని వీడాను

ఆ మాటకు కట్టుబడే టిడిపిని వీడాను

టిడిపిలో నాదెండ్ల భాస్కర్ రావు తో తాను విభేదించేవాడినని జీవన్ రెడ్డి గుర్తుచేసుకొన్నారు. ఆయనేమో కాంగ్రెస్ వాది. కానీ, చంద్రబాబునాయుడు టిడిపిలోకి రావడంతో పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన ఘటనలను జీర్ణించుకోలేకపోయినట్టు చెప్పారు జీవన్ రెడ్డి.ఎన్టీఆర్ గుండెఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళిన సమయంలో ఆరోగ్యమంత్రిగా ఉన్న రామ్మోహన్ రెడ్డి తనను నాదెండ్ల భాస్కర్ రావు వద్దకు తీసుకెళ్లాడని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ మారిపోయాడని, తనను మంత్రివర్గం నుండి తొలగిస్తానని అంటున్నాడని భాస్కర్ రావు చెప్పారు.ఆ పరిస్థితే వస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.నాదెండ్లను పదవి నుండి ఎన్టీఆర్ తప్పించడంతో తాను కూడ రాజీనామా చేసినట్టు ఆయన గుర్తుచేసుకొన్నారు.అదే జరగకపోతే తాను టిడిపిలోనే ఉండేవాడినేనని ఆయన అభిప్రాయపడ్డారు.

1996 లో చంద్రబాబు కూడ ఆహ్వనించారు

1996 లో చంద్రబాబు కూడ ఆహ్వనించారు

1996 లో కాంగ్రెస్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వలేదు. అయితే ఆ సమయాన్ని ఆసరాగాచేసుకొన్న చంద్రబాబునాయుడు తనను పార్టీ చేరాలని ఆఫర్ ఇచ్చాడని ఆయన ప్రస్తావించారు.కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసిన ఎల్. రమణ, ఖలాళీ చేసిన అసెంబ్లీ స్థానాన్ని తనకు ఇవ్వాలని బాబు నిర్ణయం తీసుకొన్నాడు.రాంకిషన్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి బాబు మాట్లాడాలని అడిగారు. అయితే తాను మరోసారి ఆచయనకు టచ్ చేసుకొన్నాడన్నారు.

 పీసీసీ అధ్యక్షుడి నియామకం సరికాదు

పీసీసీ అధ్యక్షుడి నియామకం సరికాదు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పిసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం బీసీ నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. అయితే నాయకుడి ఎంపిక విషయంలో మాత్రం రాంగ్ సెలక్షన్స్ కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూనుకొందన్నారు. కెసిఆర్ నుఢీకొట్టే వ్యక్తి ని తయారు చేసుకోవాల్సి ఉందన్నారు.

కోవర్టులు ఎవరూ లేరు

కోవర్టులు ఎవరూ లేరు

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటిరహస్యాలు ఉండవన్నారు జీవన్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీలో రహస్యమనేది లేనప్పుడు కోవర్టులకు అవకాశం ఎక్కడదన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించి అమలు చేయకపోతే రాష్ట్రానికి న్యాయం జరిగేదనే భిప్రాయపడ్డారు.

టిఆర్ఎస్ లోకి రావాలని కెసిఆర్ కోరారు

టిఆర్ఎస్ లోకి రావాలని కెసిఆర్ కోరారు

1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తనకు, కెసిఆర్ టిక్కెట్టు ఇచ్చాడు. అయితే ఆ ఎన్నికల్లో తాను విజయం సాధించాను. కెసిఆర్ ఓటమిపాలయ్యాడన్నారు. కరీంనగర్ తో ఆయనకు బంధుత్వం ఉండేది. ఈ కారణంగానే ఆయన తరచూ కరీంనగర్ కు వచ్చేవాడు.ఆ రకంగా తమ మధ్య స్నేహం పెరిగిందని ఆయన చెప్పాడు.టిఆర్ఎస్ ఏర్పాటుచేసిన సమయంలో కూడ తనను తీసుకెళ్ళాలని ప్రయత్నించినా తాను ఆ పార్టీలో చేరడానికి తాను సమ్మతింతచేలేదన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Iam left Tdp for former chief minister Nadendla Bhaskara rao promise.Abn Andhrahyothy interviewed him.Chandrababu naidu , Kcr asked to join their parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more