ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్ - మళ్లీ తెలంగాణకు షిఫ్ట్
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఆమెకు భారీ ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్ లో చేరిన ఆమెను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో ఆమ్రపాలి తెలంగాణలో పోస్టింగ్ దక్కించుకోనున్నారు.
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ఊరట లభించింది. ఏపీకి రిలీవైన అధికారిణి ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయించాలని క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమె అభ్యర్థనను అనుమతించిన క్యాట్ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. క్యాట్ నిర్ణయంపై అధికారిణి ఆమ్రపాలి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏం జరిగింది..?
ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 2014 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి.. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, సంతోశ్ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఏపీకు కేటాయించారు. ఐఏఎస్ కేడర్ కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్. శివశంకర్, సి. హరి కిరణ్, ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ ను తెలంగాణకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
అయితే విభజన తీరుపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీళ్లంతా 2014 లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఆ తర్వాత కొంతకాలానికి రంగనాథ్, సంతోశ్ మెహ్రా తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై దర్యాప్తు జరిపి క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని DOPT 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది.

అయితే తాజాగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఆమెకు భారీ ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్ లో చేరిన ఆమెను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో ఆమ్రపాలి తెలంగాణలో పోస్టింగ్ దక్కించుకోనున్నారు.
ఆమ్రపాలి నేపథ్యం..
కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణినిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించారు. ఐఐటి మద్రాస్ నుండి ఇంజనీరింగ్ పట్టా సాధించారు. IIM బెంగుళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications