భార్యకు దూరంగా ఐఎఎస్: డ్రైవర్ హత్య కేసులో పాత్ర, స్వలింగ సంపర్క కోణం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఐఎఎస్ అధికారి భార్య కారు డ్రైవర్ నాగరాజు హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నాగరాజు హత్య కేసులో ఐఏఎస్‌ అధికారి ధరావత్‌ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఐఎఎస్ భార్య కారు డ్రైవర్ హత్య: వెనక ఓ మహిళ, అశ్లీల వీడియోలే కారణమా....

నాగరాజు మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆయన తన కుమారుడు వెంకట సుక్రునాయక్‌కు ఆయన సహకరించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని అంున్నారు.దీంతో ఆదివారం రాత్రి నుంచి వెంకటేశ్వరరావును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పోలీసులతో ఒక దశలో వెంకటేశ్వరరావు గొడవకు కూడా దిగాడు. పోలీసు స్టేషన్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేశారు

IAS official role in driver Nagaraju’s murder

డ్రైవర్‌ నాగరాజు హత్య కేసును స్వలింగ సంపర్క కోణం గురించి కూడా పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరిగిన రోజు ఈ విషయంపైనే సుక్రు, నాగరాజుల మధ్య వాగ్వాదం చేసుకుందని అంటున్నారు. కోపంతో సుక్రు నాగరాజును కొట్టడంతో కింద పడిపోయి మరణించాడు తెలుస్తోంది.

తెలంగాణ వ్యవసాయ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ధరావత్‌ వెంకటేశ్వర్‌రావు ఆరేళ్లుగా తన భార్య అనితకు దూరంగా వేరే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు అనిత వద్ద నివసిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన భూక్య నాగరాజు(26) రెండేళ్లుగా ఆమె కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు.

సుక్రు ఎల్బీనగర్‌లోని మహాత్మాగాంధీ కళాశాలలో లా చదువుతున్నాడు. ఈ క్రమంలోనే నాగరాజు, సుక్రుల మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తరచూ దూర ప్రాంతాలకు వెళ్లి మద్యం సేవించేవారు. అప్పుడప్పుడు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులో ఉన్న సాయికళ్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లి మద్యం తాగేవారు. ఈ అపార్ట్‌మెంట్‌ కాపాలదారుతో నాగరాజుకు ఉన్న పరిచయంతో అది సాధ్యమైందని సమాచారం.

IAS official role in driver Nagaraju’s murder

ఈ నెల 17వ తేదీ రాత్రి నాగరాజు, సుక్రులు అక్కడికి వెళ్లారు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు ఆ సమయంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే సుక్రు ఎదురుగా ఉన్న నాగరాజును తలపై, పొట్టలో బలంగా కొట్టాడు. ఈ గొడవలో నాగరాజు కిందపడి స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో సుక్రు అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి అర్ధరాత్రి దాటాక అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ పైకి వెళ్లాడు.

నాగరాజు ఎలా పడిపోయాడో అలాగే ఉన్న విషయాన్ని గుర్తించాడు. ఎంతగా ప్రయత్నించినా అతను లేవలేదు. దాంతో చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నాగరాజు మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను, కింద ఉన్న బైక్‌ను తన వెంట తీసుకెళ్లాడు. అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు రాగానే సెల్‌ఫోన్‌ను బయట విసిరేశాడు. ద్విచక్ర వాహనాన్ని కృష్ణకాంత్‌ పార్కు వద్ద వదిలేసి జారుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Hyderabad west zone police on Monday questioned senior IAS officer D. Venkateswara Rao, deputy director of marketing and cooperation, in connection with the murder of his former wife’s personal driver.
Please Wait while comments are loading...