Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. కట్టే కాలేవరకు చిరంజీవి అభిమానిగానే ఉంటానని స్పష్టం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ కామెంట్లు చేశారు. కట్టే కాలేవరకు చిరంజీవి అభిమానిగానే ఉంటామని స్పష్టం చేశాడు. బేబీ మూవీ అప్రిసియేషన్ మీట్ పాల్గొన్న అల్లు అర్జున్.. బేబీ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బేబీ మూవీ చాలా బాగుందని అన్నారు. ఆర్టిస్టులు అందరు బాగా నటించారని చెప్పారు. చిన్ని సినిమా అయనా పెద్ద హిట్ సాధించిందన్నారు. బిడ్డని కనడానికి తల్లి పడేంతటి కష్టాన్ని బేబీ సినిమా కోసం దర్శకుడు సాయి రాజేష్ పడ్డారని అన్నారు.

బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు గురించి మాట్లాడారు. శ్రీనివాస కుమార్ నాయడు తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. ఆయన, తాను ఇద్దరం చిరంజీవి అభిమానుమేనని చెప్పారు. ఈ కట్టే కాలేవరకు మేము చిరంజీవి అభిమానులుగానే ఉంటామని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. చిరంజీవి సినిమా సైట్స్ లో తాను డ్యాన్స్ చేసేవాడినని.. పక్కనే ఉన్న చిన్న రూమ్ లో శ్రీనివాస కుమార్ నాయుడు ఉండే వారని చెప్పారు. ఎస్కేఎన్ జర్నలిస్ట్ గా, పీఆర్వోగా, నిర్మాతగా విజయవంతమయ్యాడని అన్నారు.

alluarjunchiranjeevi

తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కాగా బేబీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్లు రాబట్టింది. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోంది. వానలను లెక్క చేయకుండా బేబీ సినిమా చూసేందుకు ప్రేక్షులు థియేటర్లకు వస్తున్నారు.

బేబీ సినిమాలో యువ నటుడు ఆనంద దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కె ఎన్ తెరకెక్కించగా విజయ్ బుల్గానిన్ సంగీతం సమకుర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+