వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.!దీక్ష విరమించిన వీహెచ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అంబేద్కర్ విగ్రహం విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, 70 ఏళ్ల వయసులో నాలుగు రోజులుగా సీనియర్ నేత వీ. హనుమంత రావు దీక్ష చేస్తున్నా ప్రభుత్వ వర్గాలు పట్టించుకోవడం లేదని ఎఐసిసి వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు. తర్వాత వీహెచ్ గృహంలో ఠాగూర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు. ఈ సందర్బంగా ఠాగూర్ స్పందిస్తూ వీహెచ్ వెంట కాంగ్రెస్ ఉంటుందని, ఈ పోరాటాన్ని పార్టీ తరపున ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

కరోనా సమయంలో నిరాహారదీక్ష కొనసాగించడం కరెక్ట్ కాదని విరమింప చేశామని మణిక్కం ఠాగూర్ స్పష్టం చేసారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును ఆయన నివాసంలో పరామర్శించిన మాణిక్కం ఠాగూర్, పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న వీహెచ్ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసారు.

 If Ambedkar does not put up a statue, KCR will be left without history!

కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు, నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నప్పటికి, తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే తెలంగాణ వచ్చిందన్న విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరవరాదని, పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసారని, కొత్త విగ్రహం పెడితే.. దాన్ని తీసుకెళ్లి గోషామహల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని మండిపడ్డారు.

Recommended Video

Telanagana : రెండు సంవత్సరాలుగా VC ని నియమించకపోవడం బాధాకరం! - ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్ధులు

తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న కుటుంబాలను పరామర్శించారా? షర్మిల కూడా అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడాలని వీహెచ్ డిమాండ్ చేసారు.టీఆర్ఎస్ నేతలు అంబేడ్కర్ విగ్రహం గురించి ఎందుకు పెదవి విప్పడం లేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని వీహెచ్ ఘాటు విమర్శలు చేసారు.

English summary
Chief Minister Chandrasekhar Rao's handling of the Ambedkar statue was not right, said Manikkam Tagore, in-charge of AICC affairs, said the government was not paying attention to Hanumantha Rao's initiation. Later in the VH house, Tagore gave lemon juice and withdrew the initiation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X