బాల్క సుమన్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం: ప్రమోషన్ ఖాయమైనట్లే!
మంచిర్యాల: కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మొద్దని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్ షో, సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 250 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 150 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 60 ఏళ్లలో ఏమీ చయని కాంగ్రెస్.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వారంటీ లేని పార్టీ గ్యారంటీలను ననమ్ముదామా? అని ప్రశ్నించారు.

పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే 3 గంటల కరెంటు గ్యారంటీ అన్నారు కేటీఆర్. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి రావడం గ్యారంటీ అని, ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. కష్టాలు అని, బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు.. సంక్షేమం అని చెప్పారు.
రైతు బంధు కేసీఆర్ కావాలా? రాబంధు కాంగ్రెస్ కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలా? 3 గంగల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. మోడీ ఎన్ని చెప్పినా తొండి అని, ప్రధాని మనసులో తెలంగాణపై ప్రేమ లేదన్నారు. రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు కేటీఆర్.
మందమర్రి మున్సిపాలిటీలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ & పట్టణ ప్రగతి నిధుల ద్వారా చేపట్టిన రోడ్డు వెడల్పు, సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ను పురపాలక శాఖ మంత్రి @KTRBRS ప్రారంభించారు. pic.twitter.com/nZXleFDZhd
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 1, 2023
దసరా దీపావళి పండుగవేళలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ భారీగా బోనస్ ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్నారని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. రూ.500 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసుకున్నామని చెప్పారు. రాబోయే కాలంలో మందమర్రిని మున్సిపాలిటీగా చేసుకుందామన్నారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా మందమర్రి మున్సిపాలిటీలో నిర్మించిన సమ్మక్క -సారలమ్మ మహిళా భవన్ ను స్థానిక శాసనసభ్యులు @balkasumantrs తో కలిసి ప్రారంభించిన మంత్రి @KTRBRS pic.twitter.com/Asz7mftlXG
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 1, 2023
మరోవైపు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఓయూ నేతగా తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నికల్లోనూ బాహుబలిని ఎదుర్కొని.. విజయం సాధించారని తెలిపారు. మంత్రులుగా ఉన్న వాళ్లు చేయని పనులను బాల్క సుమన్ చేసి చూపించారని ప్రశంసించారు. భవిష్యత్తులో సుమన్ మంత్రి అయితే ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications