తెలంగాణలో జ'గన్'! కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రమ్మంటున్న కేసీఆర్.. వద్దంటున్నటీ కాంగ్రెస్
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. జూన్ 17న విజయవాడ వెళ్లి మరీ జగన్ ను ఆహ్వానించనున్నారు సీఎం కేసీఆర్ . అయితే జగన్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే తన తండ్రిని తప్పుపట్టినట్టే అని మెలిక పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క .

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే జగన్ తన తండ్రి జలయజ్ఞాన్ని తప్పు పట్టినట్టే అన్న భట్టి
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని సూచన ప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ చొరవ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహబంధం బలపడాలనేకేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ళప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారని ఇక అలాంటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వస్తారని భట్టి అంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తన తండ్రి వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని తప్పుబట్టినట్టేనని, ఆయనను అవమానించినట్టేనని భట్టి స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్ డీపీఆర్ శాసన సభలో పెట్టలేదన్న భట్టి .. రాష్ట్రంలో నేతలు కనపడట్లేదు అంటూ ఆగ్రహం
ప్రాజెక్టు టెండర్లు ఇరిగేషన్ వెబ్ సైట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు సంబంధిండిన డీపీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రయోజనాల కంటే కూడా కుటంబ ప్రయోజానాలకే పాల్పడుతున్నారని విమర్శించారు. ఇక కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న నేతలు కనిపించడంలేదా? అంటూ మండిపడ్డారు భట్టివిక్రమార్క. ఇక కాళేశ్వరం డీపీఆర్ ను ఇంతవరకు శాసనసభలో ప్రవేశపెట్టలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్న భట్టి
అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ చాలా స్పష్టత ఇచ్చారని, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా ఉన్నాయని పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక జగన్ ను చూసినా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు.తమ అవినీతిపై ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రారంభానికి జగన్ వస్తే వైఎస్సార్ చేసిన ప్రాణహిత తప్పని ఒప్పుకున్నట్టు అవుతుందన్నారు భట్టి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications