పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ.!అలా చేసి ఉంటే ఈటెల కు సీఎం అయ్యే అవకాశం ఉండేది.. కానీ.!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా ఒక ప్రత్యేక అంశంపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. గులాబీ ప్రభుత్వం లో ఊహించని కుదుపుకు కారణమైన ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈటెల రాజీనామా తర్వాత ఇతర పార్టీలలో చేరే అంశం పట్ల మొదట చర్చ జరిగింది. తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక, ఈటల గెలుపోటముల గురించి తెలంగాణ ప్రజల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కానీ ఈటల రాజేందర్ ను పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత ఆయన వేయబోయే రాజకీయ అడుగు గురించి కూడా తెలంగాణ సమాజంలో చర్చ చోటుచేసుకుంది.

మలిదశ ఉద్యమ కారుడు.. కేసీఆర్ కు సమానమైన నాయకుడు ఈటల
తెలంగాణ మలి దశ ఉద్యమ కాలం నుండి ఈటల రాజేందర్ ఓ బ్రాండ్ ను సొంతం చేసుకోగలిగారు. ఉద్యమం గురించి ఈటల మాట్లాడిన విధానం ఆ తర్వాత చట్ట సభల్లో ఈటల వ్యవహారం పట్ల తెలంగాణ సమాజంలో ఈటల రజేందర్ పట్ల ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఆనాడు ఉమ్మడి ఏపిలో నిండు శాసన సభలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈటలను సంబోదిస్తూ తలకాయ ఎక్కడపెటెకుంటావని ప్రశ్నించినప్పుడు వైయస్ హీరో అయిపోయి ఉండొచ్చు గానీ ఆ తర్వాత ఈటెలకు లభించిన తెలంగాణ ప్రజల సానుభూతి వైయస్ హీరోయిజాన్ని జీరో చేసిందనడంలో సందేహం లేదు. అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి నాయకుడు ఈటల అనే చర్చ జరిగింది.

ఏపార్టీలో చేరకుండా ఉంటే పరిస్థితి వేరే ఉండేది.. అసలైన ఉద్యమకారుడు ఈటల
రాజకీయాల్లో గానీ, ఉద్యమ సమయంలో గానీ, ప్రతికూల పరిస్ధితులు ఎదురు దాడి పెంచినప్పుడు గానీ ఈటల రాజేందర్ ఎప్పుడూ ఒత్తిడికి లోను కాకుండా చాకచక్యంగా వ్యవహరించారనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. ఈటల రాజేందర్ రాజకీయంగా సమర్ధుడు కాబట్టే చంద్రశేఖర్ రావు చాలా అధికారికి కార్యక్రమాలను ఈటల బాగస్వామ్యం లేకుండా నిర్వహించే వారు కాదని తెలుస్తోంది. తెలంగాణ అవతరించిన తర్వాత ప్రభుత్వంలో రెండు పర్యాయాలు కీలక బాద్యతలు నిర్వహంచిన ఈటల రాజేందర్ తో ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విభేదించారు. అంతటితో ఆగకుండా మంత్రి పదవినుండి ఉద్వాసన పలకడమే కాకుండా పార్టీ నుండి కూడా ఈటలను బహిష్కరించారు చంద్రశేఖర్ రావు.

సొంత పార్టీ పెట్టుకుంటే ఆ కిక్కు వేరుండేది.. ఆసక్తిగా చర్చించుకుంటున్న ప్రజలు
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు ఇక్కడే మొదలవుతుందనే అంచనాలు చోటుచేసుకున్నాయి. మంత్రి పదవినుండి, పార్టీ నుండి బహిష్కృుతుడైన ఈటల రాజేందర్ రాజకీయ అడుగు ఎటువైపు పడుతుందనే చర్చ మొదలైంది. రాజకీయంగా ఏదైనా పార్టీని ఆశ్రయిస్తారా లేక కొత్త పార్టీ స్థాపిస్తారా.?లేక స్వతంత్ర్య అభ్యర్ధిగా సత్తా చాటుకుంటారా.? అనే అంశాలపై లోతైన విశ్లేషణలు జరిగియి. తెలంగాణ రాజకీయాల్లో గానీ, ఉద్యమ పోరాటంలో గానీ చంద్రశేఖర్ రావు తర్వాత ఈటల రాజేందర్ పేరునే ప్రముఖంగా ప్రస్తావించుకుంటారు. అంటే తెలంగాణలో చంద్రశేఖర్ రావుకు సరి సమానమై ఉజ్జీ రాజేందర్ మాత్రమేననే అంచనాలు కూడా వెలువడ్డాయి.

కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నేత.. సీఎం అయ్యే వాడని ఈటలపై చర్చ
అలాంటి తరుణంలో ఈటల రాజేందర్ ఏ పార్టీలో చేరకుండా ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖర్ రావు ఆదేశిస్తున్న విచారణలను ఎదుర్కొంటూ తెలంగాణ ప్రజల మద్దత్తు కూడగట్టుకుంటూ సొంత పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగరేసి ఉండి ఉంటే ఈ రోజు చంద్రశేఖర్ రావుకు ధీటుగా నిలబడి ఉండే వాడనే చర్చ జరుగుతోంది. ఒక రకంగా చంద్ర శేఖర్ రావుకు ప్రత్యామ్నాయ నాయకుడిగా కూడా ఈటల రాజేందర్ ఎదిగే వాడనే చర్చ జరుగుతోంది. స్వతంత్ర్యంగా ముందుకు వెళ్తే రాజకీయాల్లో ప్రజల నుండి అనూహ్య మద్దత్తు లభించి ఉండి ఉండేదనే చర్చ కూడా జరుగుతోంది. గులాబీ పార్టీలోని అసంతృప్తి నేతలందరూ ఈటలకు మద్దత్తు తెలిపేవరని తెలుస్తోంది. ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని నిట్ట నిలువుగా చీల్చే అవకాశాన్ని కూడా ఈటల పోగొట్టుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒంటరి పోరాటంతో ప్రజా మద్దత్తును కాంక్షిస్తే తెలంగాణలో ఈటల ముఖ్యమంత్రి అయ్యే వాడని ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications