వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదరను, బెదరను.. టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల రాజేందర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్ వేళ నేతల మధ్య మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్.. కేసీఆర్, హరీశ్ రావు లక్ష్యంగా విమర్శలు చేశారు. బెదిరిస్తే భయపడబోనని తేల్చిచెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడనని.. ఉద్యమం నుంచి వచ్చానని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమాలతో ఆర్ కృష్ణయ్యతో కలిసి తిరిగానని పేర్కొన్నారు.

తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల్లో గెలవాలనే ఆకాంక్షతో వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. దొడ్డి దారిలో తనను భయపెడితే భయపడనని ఈటల రాజేంధర్ స్పష్టంచేశారు. హుజురాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల మీద మాట్లాడబోనని చెప్పారు. ఇటు హరీశ్ రావు లక్ష్యంగా కూడా విరుచుకుపడ్డారు. ట్రబుల్ షూటర్‌గా, ఎన్నికల వ్యూహకర్త అనుకుంటున్న హరీష్‌రావు చేస్తున్నవన్నీ మోసాలేనని ఈటల రాజేందర్ ఆరోపించారు. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

ఇటు హుజురాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ కాస్త వీక్‌గా ఉంది.

if u threatening but im not scared:etela rajender

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు.

సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
bjp leader etela rajender angry on trs government. if u threatening but i'm not scared he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X