అమ్మా! చదవలేకపోతున్నా!!: విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి: తీవ్ర మనస్తాపానికి గురైన ట్రిపుల్ ఐటి చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో మూడవ సంవత్సరం చదువుతున్న స్వప్న అనే విద్యార్థిని మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ సంఘటన మెదక్ జిల్లా మనూర్ మండలం ఉసిరికెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

అధ్యాపకురాలు, తోటి విద్యార్థి వేధింపులకు గురిచేయడంతో పాటు తల్లిని పిలిచి తనను కళాశాల నుండి ఇంటికి పంపించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆమె దారుణానికి పాల్పడింది. ఉసిరికెపల్లి గ్రామానికి చెందిన బగ్గి అంజిరెడ్డి, సంగమ్మల ఐదవ సంతానమైన బగ్గి స్వప్న (18) 2011-12 సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమమైన మార్కులు సంపాదించడంతో బాసర ట్రిపుల్ ఐటిలో సీటు సంపాదించుకుని చదువుకుంటోంది.

IIIT girl student commits suicide in medak district

కొద్ది రోజుల క్రితం ట్రిపుల్ ఐటిలో చదువుతున్న రాజేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతను మరణించినప్పటి నుంచి విజయభాను అనే అధ్యాపకురాలితో పాటు సువర్ణ అనే తోటి విద్యార్థి రాజేష్ మృతికి నీవే కారణమంటూ స్వప్నను తరచుగా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. అయతే, తనకు అతనితో ఎలాంటి సంబంధం లేదని తెలిపినా వారు వినకపోగా ఆదివారం తన తల్లి సంగమ్మను కళాశాలకు పిలిచి స్వప్నను ఇంటికి పంపించారు.

త్వరలోనే పరీక్షలు రాయాల్సి ఉండడం, తోటి విద్యార్థుల ముందు అవమానానికి గురైన స్వప్న మానసికంగా అశాంతికిలోనై మంగళవారం సాయంత్రం 5 గంటల కు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది.

"అమ్మా నేను పరీక్షలు రాయలేకపోతున్నా..నాపై విజయభాను అనే అధ్యాపకురాలు, తోటి విద్యార్థిని సువర్ణ లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు...రాజేష్ అనే విద్యార్థి చనిపోయింది వాస్తవమే.. అయినా అతనితో తనకు ఎలాంటి సంబంధాలు లేదంటూ మరణ వాంగ్మూలాన్ని రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+