Rains: తెలంగాణకు వర్షసూచన.. ఆ తేదీల్లో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలెర్టు కూడా జారీ చేసింది. అలాగే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, హైదరాబాద్ లోని షేక్ పేటలో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాత నమోదుయింది. సాధారణ వర్షపాతం 46.6 సెంటీమీటర్ల వర్షపాతం కాగా.. 68.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్ విషయానికొస్తే, ప్రస్తుత వర్షాకాలంలో 450.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా సాధారణ వర్షపాతం 363.3 మిమీగా ఉంది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, చార్మినార్‌లలో అత్యధికంగా 49 శాతం వర్షపాతం నమోదయింది. ఎల్‌నినో సంవత్సరం అయినప్పటికీ తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది.
అటు ఏపీలోను ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని అంచనా వేసింది. అటు ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో 51 మంది మరణించారని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ఇచ్చారు.












Click it and Unblock the Notifications