Heavy Rains: రెండు రోజులు పాఠశాలలకు సెలవు - తాజా అలర్ట్..!!

రెండు రోజులు వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో కుండపోత కురుస్తోంది. పాఠశాలలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది.

భారీ వర్షాలతో అప్రమత్తం:భారీ వర్షాలతో హైదరాబాద్ లో జనజీవనం పైన ప్రభావం పడింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం..జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి.

IMD Issue Heavy rain fall alert for Telangana, Govt Declared holidays for Schools

ప్రభుత్వం పాఠశాలలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ కు వాతా వరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్‌లను, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

పాఠశాలలకు సెలవులు:తెలంగాణలోని రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతున్నది. నిజామాబాద్‌ జిల్లా మాధవ్‌నగర్‌లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. నిజామాబాద్‌-డిచ్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకున్నది. వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి. గోదావరికి వస్తున్న భారీ వరదతో కాళేశ్వరం వద్ద ప్రవాహం పెరుగుతోంది.

హైదరాబాద్ లో పరిస్థితిని మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు సూచనలు చేస్తున్నారు. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పెరిగింది.

దవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాచలం వద్ద ఆరు లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా వస్తున్న ఫ్లో తో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+