హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ - బయటకు వెళ్తున్నారా..!!

హైదరాబాద్ నగరాన్ని వాన కుదిపేస్తోంది. వర్షం తీవ్రత మరోస్థాయికి చేరింది. ఆ ఉధృతి కుండపోతకు మించి సాగింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిస్తున్న వర్షాలతో నగర వాసులు వణికిపోతున్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిది. ఐటీ సంస్థలకు పోలీసులు లాగౌట్ అడ్వయిజరీ ఇచ్చారు. హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. అవసరం అయితే మినహా బయటకు రావద్దంటూ నగర వాసులకు సూచనలు అందుతున్నాయి.

చినుకుతో వణుకు:వర్షం అంటే నగర వాసులు హడలిపోతున్నారు. భారీ వర్షం పడితే పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు తప్పటం లేదు. ఈ రోజు, రేపు హైదరాబాద్ కు భారీ వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హుస్సేన్​సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది.హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద పెరుగుతూనే ఉంది. దాంతో.. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మూసీ నది పొంగిపొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్‌ బృందాలను రెడీ చేసింది.

IMD Issues Red alert for Hyderabad city Expecting heavy rains for coming three days, Adviosry or IT Companies

నిండుకున్న జలాశయాలు:వర్షాలకు హుస్సేన్​సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. దాంతో.. పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు పెరుగుతున్న వరద కారణంగా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్ణయాలు తీసుంటున్నారు.

మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు తప్పవనే తాజా హెచ్చరికలతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ఐటీ క్యారిడార్లో రెండు రోజులపాటు ఆఫీసు వేళలు మార్చుకోవాలని సూచించారు. దానిలో భాగంగా.. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఒకేసారి బయటికి రాకుండా వేర్వేరు లాగౌట్ సమయాలను ప్రకటించారు.

రెండు రోజులు అప్రమత్తం:ఐటీ కారిడార్‌లో దశలవారీగా లాగ్‌ అవుట్‌ను అమలు చేయాలని నిర్ణయించిన పోలీసు శాఖ.. కారిడార్‌ను మూడు భాగాలుగా విభజించింది. ఆయా ప్రాంతాల్లో ఉండే కంపెనీలు ఒకేసారి కాకుండా గంటన్నర వ్యవధిలో దశలవారీగా లాగ్‌ అవుట్‌ అమలు చేయడం వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా తగ్గుతుంది. మంగళవారం ఈ ప్రణాళిక అమలు కాగా.. బుధవారం కూడా అమలు చేయాలని పోలీసు శాఖ ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలకు సూచించింది. హైదరాబాద్ లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో అవసరం అయితేనే బయటకు రావాలని సూచనలు అందుతున్నాయి. మరో రెండు రోజులు హైదరాబాదీలు అప్రమత్తం గా ఉండాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+