ఇక దంచుడే, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - తీవ్ర హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న వారం రోజుల ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ లోనూ వర్షం ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
భారీ వర్షాలపై వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో 9 నుంచి 15వ తేదీ వరకూ.. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 7 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. వర్షాలకు సంబంధించిన సూచనలు, హెచ్చరికలను ఓ ప్రకటన ద్వారా వాతావరణ శాఖ విడుదల చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నెల 12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.
తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక.. హైదరాబాద్ లో వర్షం మరో సారి కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన ఇబ్బందులతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications