వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TPCC Chief: రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి చెక్ : ఢిల్లీలో ట్విస్టుల మీద ట్విస్టులు : పూర్తిగా డామినేట్ చేసేలా..!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ రాజకీయమే సపరేటు. అందునా తెలంగాణ రాజకీయం అంటే అసలు సిసలైన కాంగ్రెస్ రాజకీయానికి కేరాఫ్ అడ్రస్. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ నియామకానికి సంబంధించి కొన్ని నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఏ రోజుకా రోజు ఈ రోజే నిర్ణయం అంటూ ప్రచారం సాగటం..కార్యకర్తలు ఆశగా ఎదురు చూడటం కామన్ అయిపోయింది. జీవన్ రెడ్డికి ఖాయమైందంటూ ఒక సారి..రేవంత్ రెడ్డి పేరు ఫైనల్ అంటూ మరోసారి ఏఐసీసీ నేతల నుండే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాచారం అందుతోంది. కానీ, పేరు మాత్రం అధికారికంగా ప్రకటించటం లేదు. అయితే, టీపీసీసీ చీఫ్ విషయంలో ఢిల్లీ కేంద్రంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

 రేవంత్ కు కోమటిరెడ్డి చెక్..

రేవంత్ కు కోమటిరెడ్డి చెక్..


పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఖరారు చేసినా అందరూ కలిసి పని చేయాలనే ఏఐసీసీ నేతల సూచనలను ఇక్కడి నేతలు అంగీకరించటం లేదు. ఎవరికి వారు లాబీయింగ్ ముమ్మరం చేసారు. అయితే, తాజాగా టీపీసీసీ ఎంపికలో ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ కేంద్రంగా పూర్తిగా డామినేట్ చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని గతంలో వ్యాఖ్యానించిన కోమటి రెడ్డి..ఇప్పుడు తనకు పీసీసీ పదవి కోసం ఢిల్లీలోనే మకాం వేసి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ లో ఎలా పావులు కదపాలో బాగా తెలిసిన ఆయన ఇప్పుడు పార్టీలోని కొందరి సహకరాంతో పీసీసీ పదవి దక్కించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సోనియా గాంధీ ఢిల్లీలో ముమ్మర లాబీయింగ్..

సోనియా గాంధీ ఢిల్లీలో ముమ్మర లాబీయింగ్..

రేవంత్ రెడ్డి పేరు ఖరారైందనే ప్రచారం నడుమ..కోమటిరెడ్డి చెక్ పెట్టారని.. ఇప్పుడు ఏఐసీసీ ఆలోచన మారిందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ పేరు ప్రకటనకు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తెలంగాణ ముఖ్య నేతలతో ఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో కొందరు నేతలు మొహమాటం లేకుండా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, తాజాగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ తరువాత వెంటనే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. గత వారం మొత్తం కోమటిరెడ్డి ఢిల్లీలోనే మకాం వేసారు. ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నాలు చేసారని సమాచారం.

టీపీసీసీ నాకెందుకు ప్రకటించరు...

టీపీసీసీ నాకెందుకు ప్రకటించరు...

ఇక, ఇప్పుడు ఆయన నేరుగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ను కలిసి తెలంగాణ పీసీసీ చీఫ్ గా తన పేరు ప్రకటించేందుకు ఆలస్యం ఎందుకు..అభ్యంతరం ఏంటని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తోనూ కొత్త నియామకం అంశం పైన నిలదీసారని పార్టీలో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి..ప్రచార కమిటీ ఛైర్మన్లు..వర్కింగ్ ప్రెసిడెంట్లు గా ఇద్దరి చొప్పున నియమిస్తూ...ఆశావాహులకు పీసీసీలో సమ ప్రాధాన్యత..సామాజిక వర్గాల వారీగా తగిన కేటాయింపులు చేయాలని ఏఐసీసీ ఆలోచనగా తెలుస్తోంది.

Recommended Video

V.Hanumanta Rao Letter To AICC Over T Congress| TPCC | Oneindia Telugu
 రేవంత్ రెడ్డి మౌనంగా..

రేవంత్ రెడ్డి మౌనంగా..

అయితే, శనివారమే టీపీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. రోజు రోజుకీ ఢిల్లీ కేంద్రంగా ఆలోచనలు మారిపోతున్న సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా హడావుడి చేస్తున్నట్లుగా కనిపించటం లేదు. ఎవరెన్ని ప్రయాత్నాలు చేసినా..రేవంత్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని..ఈ మేరకు హైకమాండ్ నుండి రేవంత్ కు సంకేతాలు ఉన్నాయంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ సాయంత్రానికి టీపీసీసీ చీఫ్ ప్రకటన వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, ఢిల్లీలో జరుగుతన్న పరిణామాలతో...ఈ విషయం మరింత సాగదీయటం మంచిది కాదనే అభిప్రాయంతో ఏఐసీసీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఎవరి పేరు పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తారు... ఆ తరువాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TPCC issue became a headache for AICC as Komatireddy is now demanding pcc Chief for him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X