కాంగ్రెస్‌కు షాక్: తెరాసలోకి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్?
కరీంనగర్: నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై కాంగ్రెసు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కత్తులు నూరుతున్న సమయంలో వారికి షాక్ తగిలే వార్త బయటకు వచ్చింది. కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పొన్నం ప్రభాకర్ సోదరుని కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్ కంపెనీ టెలెకా నెట్‌వర్క్ టెక్నాలాజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. దీంతో పొన్న ప్రభాకర్ తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడదు గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ మంత్రి గడ్డం వినోద్, తదితరులు తెరాసలో చేరిన సందర్భంలోనే పొన్నం ప్రభాకర్ కూడా తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడదు వినోద్ కుమార్ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతనే పొన్నం ప్రభాకర్‌కు పచ్చ జెండా ఊపాలని తెరాస నాయకత్వం భావించింది. దాంతో అప్పట్లో ఆయన చేరిక వాయిదా పడినట్లు చెబుతున్నారు.

ఇదిలావుటే, తనకు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేస్తేనే తెరాసలో చేరుతానని పొన్నం ప్రభాకర్ మెలిక పెట్టడం వల్ల చేరిక ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. వేములవాడ అసెంబ్లీ నియోజవర్గానికి వచ్చే ఎన్నికల్లో పొన్నంకు తెరాస కేటాయించే అవకాశమున్నదని కూడా ప్రచారం జరిగింది.
ప్రభాకర్ సోదరుడి కుమారుడు ప్రస్తుతం హుజూరాబాద్‌లో టెలెకా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా మంత్రి ఈటెల రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన గడ్డం వివేక్ కూడా హాజరయ్యారు. దీంతో పొన్నం ప్రభాకర్ తెరాసలో చేరడం ఖాయమై పోయినట్లుగా ప్రచారం సాగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications