హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే హైదరాబాద్ వచ్చా: వీసీని టార్గెట్ చేసిన కన్నయ్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేముల రోహిత్‌ తల్లి రాధిక, తమ్ముడిని కలిసేందుకు తాను హైదరాబాద్ వచ్చానని ఢిల్లీ జెన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ బుధవారం తెలిపారు.

శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. హెచ్‌సియులో సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు.

అడుగడుగునా పోలీసులు తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కన్నయ్యకు సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట రెడ్డి, విద్యార్థి సంఘం నేతలు స్వాగతం పలికారు.

బుధవారం సాయంత్రం కన్నయ్య కుమార్ మాట్లాడుతూ... క్యాంపస్‌లోకి వెళ్లవద్దని చట్టం చెబితే తాను గౌరవిస్తానని చెప్పారు. ఓ వర్సిటీ విద్యార్థి మరో వర్సిటీలోకి వెళ్లవచ్చునని చెప్పారు. అసలు వైస్ ఛాన్సులర్ అప్పారావుకే వర్సిటీలోకి వెళ్లే నైతిక హక్కు లేదన్నారు.

తాను సాయంత్రం రోహిత్ తల్లి రాధికను పరామర్శిస్తానని చెప్పారు. అప్పారావు కారణంగానే రోహిత్ చనిపోయాడనే ఆరోపణ ఉందని చెప్పారు. హెచ్‌సియు వీసీగా ఉండే అర్హత అప్పారావుకు లేదన్నారు. వర్సిటీల్లోవివక్ష ఉండవద్దనన్నారు. రోహిత్ చట్టం తెచ్చే వరకు పోరాటం చేస్తానని చెప్పారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

హెచ్‌సియు వీసీ అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ రోహిత్‌ తల్లి బుధవారం సాయంత్రం హెచ్‌సియులో దీక్ష చేపట్టనున్నారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం విమానంలో బయలుదేరి శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగిన కన్నయ్యకు సిపిఐ అగ్రనేతలు కె నారాయణ, చాడా వెంకట రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

రోహిత్ వేముల తల్లి దీక్షకు సంఘీభావం తెలిపేందుకే హైదరాబాదు వచ్చానన్నారు. రోహిత్ పేరిట చట్టం తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని కన్నయ్య కుమార్ ప్రకటించారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే తాను హెచ్‌సీయూకు వెళుతున్నానని అన్నారు. తనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 'రోహిత్‌ చట్టం' చేసే వరకు పోరాడుతానన్నారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్ రాక, అప్పారావు వీసీగా బాధ్యతలు చేపట్టడంతో కొందరు విద్యార్థులు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. హెచ్‌సియులో భారీగా పోలీసులను మోహరించారు.

English summary
In Hyderabad, Kanhaiya Kumar Vows Justice For Rohith Vemula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X