Loksabha Election 2024 Results: బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కరీంనగర్ లో బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో డీకే అరుణ ముందంజ కొనసాగుతూన్నారు.
మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యం ఉన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి నాగేష్ ముందంజలో ఉన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘరామ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉన్నారు. మహబుబాబాద్ లో హస్తం పార్టీ అభ్యర్థి బలరామ్ నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది. ఆరా సర్వే ప్రకారం ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ గెలుస్తుందని.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, చెవేళ్ల, మల్కాజి గిరి, సికింద్రాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ బీజేపీ గెలుస్తుందని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ లో ఎంఐఎం గెలుపొందే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications