మీరూ బస్సు చార్జీలు పెంచండి.. ఏపీఎస్ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి; రీజన్ ఇదే!!

బస్సు చార్జీల పెంపుతో తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీ కి సిరులపంట కనిపిస్తుందా? ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ని బాగా దెబ్బ కొడుతుందా ? ఏపీఎస్ఆర్టీసీ తీరు టిఎస్ఆర్టిసి కి పెను నష్టం చేకూరుస్తుందా? పెద్ద తలనొప్పిగా తయారైందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ఏపీ ప్రభావం అంచనా వెయ్యకుండా బస్సు ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

ఏపీ ప్రభావం అంచనా వెయ్యకుండా బస్సు ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

నష్టాలలో ఉన్న తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టడం కోసం, లాభాల బాట పట్టించడం కోసం తెలంగాణ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే పక్క తెలుగురాష్ట్రం ప్రభావం తమ మీద ఉంటుందని ఊహించలేదు టీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ సేవలను మెరుగుపరిచి, ఆదాయ మార్గాలను పెంచే ప్రయత్నం చేస్తూనే తాజాగా డీజిల్ సెస్ పేరుతో చార్జీలను పెంచి మరో మారు బాదుడుకు శ్రీకారం చుట్టింది. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను పెంచిన తెలంగాణ ఆర్టీసీ, తాజాగా బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ఆర్టీసీని విజ్ఞప్తి చేసింది.

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాలని టీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాలని టీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ సర్వీసులను కాకుండా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సులనే ప్రయాణికులు ఆశ్రయిస్తుండటం తో తెలంగాణ ఆర్టీసీ ఏపీ ఎస్ ఆర్ టి సి బస్ చార్జీలు పెంచాలని కోరింది. రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే సర్వీసులలో ఒకే విధమైన బస్సు చార్జీలు ఉండాలి. దానికి అనుగుణంగా ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ ని తెలంగాణ ఆర్టీసీ కోరింది.

తెలంగాణా ఆర్టీసీ బస్సుల్లో కాకుండా ఏపీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు

తెలంగాణా ఆర్టీసీ బస్సుల్లో కాకుండా ఏపీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు

ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ కి కాసుల వర్షం కురిపిస్తుంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో బస్సులు ఎక్కే ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన బస్సులు అవునా కాదా అన్నది కన్ఫామ్ చేసుకొని మరీ ఎక్కుతున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లడానికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది అని సమాచారం.

ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం .. బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలన్న టీఎస్ ఆర్టీసీ

ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం .. బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలన్న టీఎస్ ఆర్టీసీ

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య బస్సుచార్జీలలో భారీ వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం నేపథ్యంలోనే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారని గుర్తించిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాష్ట్ర ఒప్పందం నేపథ్యంలో ఏపీ బస్సు చార్జీలను పెంచాలని కోరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఒకే విధమైన ఛార్జీలు ఉండాలని సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏపీఎస్ఆర్టీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+