వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంటు బిల్లుల అధికంగా రావడం దారుణం.!ప్రశ్నిస్తే అరెస్టు చేయడం మరీ పైశాచికమన్న బండి సంజయ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపి మరోసారి ధ్వజమెత్తింది. నిన్నటి వరకూ లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజల మీద కరెంటు బిల్లులు మోయలేని భారాన్ని మోపుతున్నప్పటికి ప్రభుత్వం స్పందించకపోడం శోచనీయమని తెలంగాణ బీజేపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాదాపు మూడు నెలలుగా ఎలాంటి ఆదాయం లేని నిరుపైదలు, మద్యతరగతి ప్రజలు ఇప్పుడిప్పుడే తమ కలాపాలను పునరుద్దరించుకున్నారని, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి వారికి ఇంకా సమయం పడుతుందని, ఇంతలోనే కరెంటు బిల్లుల రూపంలో మరో కష్టం తరుముకొచ్చిందరి బీజేపి నేతలు ఆవేదన వ్యక్తం చేసారు.

 అరెస్టులు అప్రజాస్వామికం.. తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ బండి సంజయ్..

అరెస్టులు అప్రజాస్వామికం.. తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ బండి సంజయ్..

అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా విద్యుత్ సౌధా ముందు నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్న నేతలను అరెస్టు చేయడం దారుణమని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. అధికంగా వచ్చిన కరెంటు బిల్లులను రద్దు చేసేంత వరకూ గులాబీ ప్రభుత్వం పై బీజేపి పోరాటం చూస్తూనే ఉంటుందని, దాంతో పాటు బిజెపి డిమాండ్ లు పరిష్కరించేవరకు ధర్నా కొనసాగిస్తామని బీజేపి హెచ్చరించింది. తెలంగాణలో నిరుపేదలపై భారం మోపితే సహించేది లేదని, తెలంగాణ ప్రభుత్వం అసంబద్ధ విధానాలు మానుకోవాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్‌ కుమార్ మండిపడ్డారు.

 అధిక కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా.. విద్యుత్ సౌధా దగ్గరే బీజేపి నేతల అరెస్టు..

అధిక కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా.. విద్యుత్ సౌధా దగ్గరే బీజేపి నేతల అరెస్టు..

అంతే కాకుండా ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునివ్వడమే కాకుండా విద్యుత్ సౌధా ముందు బీజేపి నేతలు అరెస్టయ్యారు. అధిక బిల్లులను రద్దు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బిజెపి నిరవధికంగా ధర్నా కొనసాగుతుందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ, అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నాలు చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బండి సంజయ్ వ్యతిరేకించారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అవలంభిస్తోందని మండిపడ్డారు.

 అధిక విద్యత్ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. పిలుపు నిచ్చిన బీజేపి తెలంగాణ అధ్యక్షుడు..

అధిక విద్యత్ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. పిలుపు నిచ్చిన బీజేపి తెలంగాణ అధ్యక్షుడు..

సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఆందళన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. విద్యుత్‌ సౌధ ముందు నిర్వహించ తలపెట్టిన ఆందోళనలో తనతో పాటు రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాల్లో జరిగే ధర్నాలో జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లా కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలపుతున్న బీజేపి నేతలను అరెస్టు చేయడాన్ని బండి సంజయ్‌ కుమార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాగా సోమవారం ధర్నాలో కార్యకర్తలు ఎవరూ పాల్గొనవద్దని, కార్యకర్తలు పాల్గొంటే స్వీయ నియంత్రణకు అంతరాయం కలుగుతుందని సూచించారు.

Recommended Video

Family Recovered From Corona Without Going To Hospital
 అరెస్టులతో ఏమీ సాధించలేరు... తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బండి సంజయ్..

అరెస్టులతో ఏమీ సాధించలేరు... తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బండి సంజయ్..

ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు బండి సంజయ్ మండిపడ్డారు. సాంకేతిక కారణాలు, స్లాబ్‌లను సాకులుగా చూపుతూ ప్రభుత్వం జనం జేబులకు చిల్లులు పెట్టడం మానుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి, ఉద్యోగస్తుల తోపాటు అందరిపై చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేస్తున్న దోపిడీ మానుకోవాలని ధ్వజమెత్తారు. ప్రజలపై పడిన అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, వినియోగదారులకు మాఫీ చేయాలని అన్నారు. అధిక బిల్లుల రద్దు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బిజెపి నిరవధికంగా ధర్నా కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు.

English summary
The state BJP has once again raised its voice over the Telangana government.The Telangana BJP is outraged that the government is unresponsive even as it is carrying a heavy burden of unremitting bills on the people who are in lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X