Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్ళీ ధరల మంట; పెరిగిన టమాట, మిర్చి, నిమ్మకాయల ధరలు.. కిలో ఎంతంటే!!

కాస్త తగ్గినట్టు కనిపించిన కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. టమాటా, పచ్చిమిర్చి ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం బాగా పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటుంటే, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సామాన్యులు పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏప్రిల్ 24వ తేదీన కొత్తపేట రైతు బజారులో 22 రూపాయలు పలికిన టమాట ధర ఈ ఆదివారం నాటికి 38 రూపాయలకు చేరుకుంది. అంటే ఏకంగా పదహారు రూపాయలు టమాటాల ధర పెరిగింది. ఇక కిలో 60 రూపాయలు ఉన్న పచ్చిమిర్చిని ఇప్పుడు కిలో 65 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక రైతు బజార్ లు , కూరగాయల మార్కెట్ లలో కంటే బయట రోడ్డు వెంబడి, తోపుడు బండిపై విక్రయిస్తున్న కూరగాయల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో 38 రూపాయలు టమాటా ధర ఉంటే, బయట 48 రూపాయల చొప్పున టమాటాలను విక్రయిస్తున్న పరిస్థితి ఉంది.

Increased prices of tomatoes, chillies and lemons due to ramadan

ఇదిలా ఉంటే ఒక నిమ్మకాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఎండాకాలం కావడంతో ప్రజలు ఎక్కువగా నిమ్మరసం తాగడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో నిమ్మకాయల ధరలను విక్రయదారులు విపరీతంగా పెంచారు. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు కిలో ధర 250 నుంచి 300 రూపాయలు గా ఉంది. ఇక చిన్నసైజు కాయలైతే కిలో ధర 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

Increased prices of tomatoes, chillies and lemons due to ramadan

మరోపక్క రంజాన్ మాసం కూడా కావడంతో, ముస్లింలు రంజాన్ మాసంలో బిర్యానీలు, ఇతర వంటకాలకు ఎక్కువ మొత్తంలో టమాటాలను, పచ్చిమిరపకాయలను వినియోగిస్తున్న క్రమంలో కూడా ధరలను పెంచినట్లుగా తెలుస్తుంది. టమాటాలు,పచ్చిమిరపకాయలు కొరత లేకున్నా కృత్రిమ కొరతను సృష్టించి మరీ వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే వారం క్రితం వంకాయ, క్యారెట్ ధరలు 25 రూపాయలు ఉంటె ఇప్పుడు 2 రూపాయలు తగ్గి 23 రూపాయలకే లభిస్తున్నాయి. ఇక క్యాప్సికం ధరలు కూడా కాస్త తగ్గాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+