Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌పై ప్రేమను చాటుకున్న మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

భారతదేశంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా. భారత్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారత్‌లో తనకు చాలా గొప్పగా స్వాగతం పలికారని, తన హృదయంలో ఈ దేశానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిస్టినా మాట్లాడారు.

భారత సంస్కృతి, కళలు చాలా గొప్పగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఇక్కడ స్ఫూర్తి లభిస్తోందని, విలువలు బోధిస్తారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఎంతో గొప్ప భావన అని క్రిస్టినా పేర్కొన్నారు. ఎన్నో భాషలు ఉన్నా.. అంతా ఒక్కటిగా ఉండటానికి భారత్ స్ఫూర్తి అని అన్నారు.

India has a special place in my heart Miss World Kristina Piskova

మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని క్రిస్టినా ప్రిస్కోవా పేర్కొన్నారు. కాగా, 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే నెలలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పట్నుంచే కసరత్తులు మొదలయ్యాయి.

మరోవైపు, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మాట్లాడుతూ.. తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందన్నారు. ఈ ప్రాంతానికి 2500 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లలో ఎంతో వృద్ధి సాధించామని తెలిపారు. రామప్ప, వేయి స్తంభాల ఆలయం, చార్మినార్, గోల్కొండ కోట లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయని స్మితా సభర్వాల్ వివరించారు.

మేలో మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. మెడికల్ టూరిజంలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఇక, సినిమా, ఆహార రంగాలకు పెట్టింది పేరని స్మితా సభర్వాల్ పేర్కొన్నారు.

యాదాద్రిని ఆలయాన్ని దర్శించిన మిస్ వరల్డ్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని మిస్​ వరల్డ్​ ఆలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఆమెకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. మిస్ యూనివర్స్​కి స్వామి వారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు అందజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+