Indigo: శంషాబాద్‍లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం..
ఓ ఇండిగో విమానం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి ఉత్తప్రదేశ్ లోని వారణాసికి వెళ్తోంది. విమానం వేల అడుగుల ఎత్తులో ఉండగా.. సడెన్ గా విమానంలో ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నామని చెప్పారు. దీంతో ప్రయాణికులు కాస్త భయాందోళనకు గురయ్యారు.
మంగళవారం ఉదయం బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్లు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ల జాగ్రత్త ఫ్లైట్ ను ల్యాండ్ చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇండిగో 6ఈ 897 విమానం బెంగుళూరు నుంచి వారణాసికి విమానం బయలుదేరగా.. కాసేపటికే విమానంలో సాంకేతికలోపం తలెత్తడాన్ని పైలెట్ గుర్తించారు. వెంటనే సమీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు రాడార్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా శంషాబాద్ విమానాశ్రయ సిబ్బందిని కోరారు. అనుమతి లభించడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా దించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను దింపివేసి వారణాసి వెళ్లాల్సిన మరో విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications