నేటి నుంచే "ఇందిరమ్మ క్యాంటీన్లు" ప్రారంభం.. రూ.5కే టిఫిన్ !!
హైదరాబాద్‌లో పేద ప్రజలకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో.. నేటి నుంచి ( సెప్టెంబర్ 29, 2025 ) ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.5కే టిఫిన్ అందించనున్నారు. ఈ కొత్త పథకం బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, పేదప్రజలకు తక్కువ ధరలో ఆరోగ్యకరమైన టిఫిన్ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు మోతీనగర్ మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని.. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. మొదటగా 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయనున్నారు. ఆ తరువాత నగర వ్యాప్తంగా 150 కేంద్రాల్లో విస్తరించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రతిరోజూ సుమారు 25,000 మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనున్నట్లు GHMC అధికారులు తెలిపారు.

పోషకాహార మెనూ..
ప్రతి రోజు భిన్నమైన అల్పాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ సైతం సిద్ధం చేశారు. ఇందులో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ లాంటి వంటకాలు ఉంటాయి. క్యాంటీన్లు వారంలో ఆరు రోజులు తెరిచి ఉండనుండగా.. ఆదివారం సెలవుగా ప్రకటించారు. ఒక టిఫిన్ తయారీకి ఖర్చు రూ.19 చేయనుండగా.. అందులో కేవలం రూ.5 మాత్రమే ప్రజలు చెల్లిస్తారు. మిగిలిన రూ.14ని GHMC భరిస్తుంది.
రూ.5 కే మధ్యాహ్న భోజనం..
హైదరాబాద్‌లో 2013 నుంచి అన్నపూర్ణ క్యాంటీన్లు ద్వారా ప్రారంభమైన రూ.5 భోజన కార్యక్రమం పేదల ఆకలి తీర్చడంలో విజయవంతం అవుతూ వస్తోంది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక GHMC పరిధిలోని కేంద్రాల సంఖ్య 139 నుండి 150కి పెంచారు. ఇప్పుడు వీటినే ఇందిరమ్మ క్యాంటీన్ల రూపంలో అల్పాహారం, భోజనం రెండింటినీ అందించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని.. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
బిగ్ షాక్: ఐదు చలాన్లు దాటితే అంతే సంగతి. మీ లైసెన్స్, ఆర్సీ కట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!!












Click it and Unblock the Notifications