కమిషన్లకు చంద్రబాబు తెర తీశారు: విరుచుకపడ్డ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : నీటి వనరుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. 60 ఏళ్ల ఆంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె అన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం కింద 40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని అనడం అవివేకమన్నారు. కమిషన్ల రాజ్యానికి తెరతీసింది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని ఆమె విమర్శించారు.

మిషన్‌కాకతీయ పనుల్లో భాగంగా జిల్లాలో 800 చెరువులు బాగు చేసుకున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ఇప్పుడున్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే 10 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చునని చెప్పారు. జూరాల కింద ఉన్న రైతులను నాశనం చేసిన నాయకులు మీరు. ఆర్డీఎస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు.

Injustice meted out to Telangana in river water: Kavitha

ఆర్డీఎస్ తూములు పగులగొట్టి రాయలసీమ నేతలు నీళ్లు తీసుకుపోతున్నపుడు నోళ్లు మూసుకున్న నాయకులు మీరు కాదా? నీటి వనరుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కవిత అన్నారు. పచ్చగా ఉన్న నిజామాబాద్ జిల్లాను కరువు కోరల్లో నెట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

సీమాంధ్ర ప్రాంతానికి నీరు ఇచ్చేందుకే పులిచింతల ప్రాజెక్టు కట్టారని, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టుకు అనుమతిలిచ్చారని చెప్పారు. పోలవరంకు జాతీయ హోదా వస్తే.. ఆనాడు అఖిలపక్షం నిర్ణయించిన మేరకు ఎస్‌ఎల్‌బీసీ కింద 30 టీఎంసీలు ఇవ్వాలని అన్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+