ఓటుకు నోటు నుంచి నయీం వరకు: పోలీసుల విజయం వెనుక, ఎవరీ బత్తుల శివధర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు దూసుకుపోతున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఎక్కడి నేరం జరిగినా నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన పలు సంఘటనలను మనం చూశాం.

టెక్నాలజీని అందిపుచ్చుకున్న తెలంగాణ పోలీసులు సాధిస్తున్న విజయాలు అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచి మైలేజీని ఇస్తున్నాయి. ఓటుకు నోటు కేసు నుంచి తాజాగా నయీం ఎన్ కౌంటర్ వరకు తెలంగాణ పోలీసులు సాధించిన విజయం వెనుకు వినిపిస్తున్న పేరు ఇంటిలిజెన్స్ ఛీప్ బత్తుల శివధర్ రెడ్డి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సష్టించిన ఓటుకు నోటు కేసు తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసుకునే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ పాతబస్తీలో ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం, తాజాగా నయీం ఎన్‌కౌంటర్‌‌లో శివధర్ రెడ్డితో పాటు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ ఛీఫ్ విసి. సజ్జనార్‌లు కీలకపాత్ర పోషించారు.

Intel czar Shivadar and SIB head Sajjanar planned Nayeem ops well

దీంతో ఎవరీ బత్తుల శివధర్ రెడ్డి అనే చర్చ మొదలైంది. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి ఐజీపీ హదాలో తెలంగాణ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. పోలీసు శాఖలో పనిచేసే కొందరు ఉన్నతాధికారులు తెలంగాణ ఉద్యమంలో కూడా శివధర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని చెబుతారు.

ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ఇంటిలిజెన్స్ అధికారులు సైతం తెలంగాణ ఇంటిలిజెన్స్ ఛీప్‌గా ఉన్న శివధర్ రెడ్డిన ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏపీకి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి శివధర్ రెడ్డి గురించి మాట్లాడుతూ అండర్ కవర్ ఆపరేషన్స్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో దిట్టగా అభివర్ణించారు.

ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేంద్ర రెడ్డి సూచనలతో పకడ్బందిగా పథకం ప్రకారం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా ఆయన వాయిస్‌తో కూడిన ఆడియో టేపులు అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్వవహారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతగానో కలిసొచ్చింది.

ఈ ఓటుకు నోటు వ్యవహారం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ ఇంటిలిజెన్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే ఇంటిలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయంటూ ఇంటిలిజెన్స్ ఛీప్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే హైదరాబాద్‌లో ఐసీస్ సానుభూతి పరులను ఎన్ఐఏ సాయంతో అరెస్ట్ చేయడంలో తెలంగాణ ఇంటిలిజెన్స్ విజయం సాధించింది. ఇలా గనుక జరగపోతే ఐసిస్ సానుభూతి పరులు హైదరాబాద్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించేవారు. ఇలా పెను విధ్వంసం నుంచి హైదరాబాద్‌ను రక్షించడంలో తెలంగాణ ఇంటిలిజెన్స్ ఛీప్ విజయం సాధించారు.

ఇక పొలిటికల్ ఇంటిలిజెన్స్ విషయానికి వస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ముందుగానే చెప్పారు. తన 22 ఏళ్ల సర్వీసులో శివధర్ రెడ్డి రెండు సార్లు పోలీసు పతకాన్ని అందుకున్నారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.

1993లో నిర్వహించిన సివిల్ సర్వీసులో శివధర్ రెడ్డి టాపర్‌గా నిలిచారు. నల్గొండ, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ డీసీపీగా, నక్సలైట్లకు వ్యతరికేంగా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచి డీఐజీగా పనిచేశారు. ఏపీ విభజన సమయంలో విశాఖపట్నం పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+