• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెన్త్ ఫలితాలపై ఇంట‌ర్ ప్రభావం..! బిక్కు బిక్కు మంటున్న విద్యార్థులు..!!

|

హైదరాబాద్ : మొన్నటి వరకూ భవిష్యత్ అర్థం కాక ఆదోళన వ్యక్తం చేసిన ఇంటర్ విద్యార్తులు కాస్త తేరుకున్నారనుకునే లోపు మరో విద్యార్థి లోకం అయోమయంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాలతో ఉలిక్కి పడ్డ విద్యార్థి లోకం ఇప్పడు పదవ తరగతి ఫలితాలపై ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇంట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఊహించ‌ని విధంగా ఎదురైన పెనువిప‌త్తు నుంచి తేరుకునేందుకు చాలాకాల‌మే ప‌ట్టేలా ఉంది. ఇదే.. ఎన్నిక‌ల ముందు జ‌రిగిన‌ట్ట‌యితే ఊహించ‌ని ప‌రాభ‌వం చ‌విచూడాల్సి వ‌చ్చేద‌ని గులాబీ నేత‌లు ఆవేదన వ్యక్తం చుేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. సున్నిత‌మైన అంశం.. పైగా పిల్ల‌ల‌తో కూడిన విష‌యం కావ‌టంతో విప‌క్షాలు కూడా దీన్ని రాజ‌కీయం చేసుకునేందుకు నానాతంటాలు ప‌డుతున్నాయి. బీజేపీ మ‌రో అడుగు ముందుకేసి దీక్ష‌ల వ‌ర‌కూ చేర్చింది. దీంతో ఇదంతా రాబోయే ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌పై ప‌డుతుంద‌నే భ‌యం వెంటాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Inter effect on Tent results ..! Students who go back to school .. !!

అందుకే మే 13వ తేదీన పదవ తరగతి ఫలితాలు విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైన అధికార యంత్రాంగం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. పిల్ల‌ల‌ను మాన‌సికంగా సిద్ధం చేసేందుకు కౌన్సెలింగ్ సెష‌న్లు కూడా మొద‌లుపెట్టారు. విద్యార్థుల‌ను స్కూల్స్‌కు పిలిపించి మ‌రీ క్లాసులు తీసుకుంటున్నార‌ట గురువులు. ప‌రీక్ష‌ల్లో త‌ప్పినా మ‌రోసారి ప‌రీక్ష రాసి పాస్ కావ‌చ్చ‌ని ఊర‌డిస్తున్నారు. ఈ విష‌యంలో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌తో ప్రేమ‌గా ఉండ‌టంతోపాటు, ధైర్యం ఇవ్వ‌టం ద్వారా స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని వివ‌రిస్తున్నార‌ట‌. మ‌రి ఊహించ‌ని విధంగా ఎదురైన అవ‌రోధాన్ని అధిగ‌మించ‌టం పెద్ద ఇబ్బందిగా మారిందంటున్నా అధికారులు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌టం అంటే ఇదేనంటూ విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రి దీన్నుంచి స‌ర్కారు ఎలా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The official administration, which is prepared to release the tenth class results on May 13, is preparing for precautionary measures. Counseling sessions have also begun to prepare children emotionally. Teachers are invited to schools and are taking classes too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more