జూబ్లీహిల్స్ బై పోల్ లో గెలుపు వారిదే - తాజా సర్వే సంచలనం..!?
జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సీఎం రేవంత్ సైతం పార్టీ సమావేశంలో బై పోల్ పైన దిశా నిర్దేశం చేసారు. అభ్యర్ధి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుంద ని తేల్చి చెప్పారు. ఎవరికి వారు తామే అభ్యర్దిగా ప్రకటించుకోవద్దని స్పష్టం చేసారు. బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ తమ మిత్రపక్షాలతో ఈ ఎన్నిక పైన చర్చలు చేస్తోంది. ఇక, తాజాగా ఈ బై పోల్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయించగా.. అందులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
మారుతున్న లెక్కలు
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బై పోల్ అనివార్యంగా మారింది. ఈ సీటును తిరిగి దక్కించుకో వటం బీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్ సైతం ఈ సీటు పైన ఆశలు పెంచుకుంటోంది. గ్రేటర్ పరిధిలో 2023 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవ లేక పోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ను కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో జూబ్లీహిల్స్ ను గెలుచుకోవాలని భావిస్తోంది. కాగా, ఇక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంఐంఎం పాత్ర కీలకంగా మారుతోంది. ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అజాహరుద్దీన్ తానే పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా.. రేవంత్ మాత్రం అభ్యర్ధిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్ కసరత్తు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టింది. తమ పార్టీ నుంచి రెండు సార్లు విజయం సాధించిన గోపీనాథ్ కుటుంబానికి సీటు ఇవ్వాలని భావిస్తోంది. నియోజకవర్గం లో పబ్లిక్ పల్స్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. అయితే, గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఈ అంశం పైన ఇంకా నిర్ణయానికి రాలేద ని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. సునీత బరిలోకి దిగటానికి అంగీరించకుంటే విష్ణు వర్ధన్ రెడ్డికి సీటు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. కాగా, సర్వేలో నియోజక వర్గ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మాగంటి కుటుంబ సభ్యులకే సీటు ఇస్తేనే బీఆర్ఎస్ కు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నట్లు సర్వే సంస్థల సమాచారం. కాగా, ఎంఐఎం సహకారం ఏ రూపంలో కాంగ్రెస్ కు అందినా... అధికార పార్టీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చినట్లు తెలుస్తోంది.
గెలుపు ప్రతిష్ఠాత్మకం
ఇక్కడ గెలుపు సిట్టింగ్ సీటు కావటంతో బీఆర్ఎస్ ... అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ కు ప్రతిష్ఠా త్మకంగా మారుతోంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి ఒక పారిశ్రామిక వేత్త పేరు ప్రముఖంగా ఈ సీటు కోసం వినిపిస్తోంది. కాగా, టీడీపీ.. జనసేన నుంచి మద్దతుతో మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ని బరిలోకి దించాలనేది కమలం పార్టీ నేతల ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఈ పార్టీలు ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకా శం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సర్వే నివేదికల్లో మాత్రం ఏ పార్టీకి ఏకపక్షంగా లేదనే విషయం స్పష్టం అవుతోంది. ఎంఐఎం సహకారం.. ప్రధాన పార్టీలు అభ్యర్దుల ఖరారు తరువాత పరిస్థితుల్లో మార్పు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠతను పెంచుతోంది.












Click it and Unblock the Notifications