నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు..ఏర్పాట్లు పూర్తి
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సారిగా ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు. ఇక హాల్ టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాటు చేసింది ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు. హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం లేకుండానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని అధికారులు తెలిపారు.
మొదటి సంవత్సరం పరీక్షలు హాజరయ్యేవారు 5,46,368 మంది ఉండగా.. రెండో సంవత్సరంలో 5,18,788 మంది హాజరుకానున్నారు. ఇక ఇంటర్మీడియెట్ పరీక్షలు స్మూత్‌గా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ప్రత్యేక్ స్క్వాడ్‌లు , కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీలో ఇంటర్ పరీక్షల కోసం 1,411 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Recommended Video

ఇక తెలంగాణలో కూడా ఈ రోజు నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,65,839 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,80,516 మంది విద్యార్థులు హాజరుకానుండగా... 4,85,323 మంది రెండో సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1339 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంగా 25,550 మంది ఇన్విజిలేటర్లను బోర్డు నియమించింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications