మహీంద్రా విశ్వవిద్యాలయంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..!
ద్రా విశ్వవిద్యాలయంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ తెలంగాణ టాస్క్‌ఫోర్స్ ఛేదించింది. మాల్నాడు రెస్టారెంట్ డ్రగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రాకెట్ గుట్టురట్టయింది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా.. దాదాపు 50 మంది విద్యార్థులపై విచారణ కొనసాగుతోంది. నార్కోటిక్ పార్సిళ్లను కొరియర్ సేవల ద్వారా పంపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
స్వాధీనం..
ఈ ఆపరేషన్‌లో వారి వద్ద నుండి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల అధిక నాణ్యత గల ఓజీ వీడ్, తూకం యంత్రం, ప్యాకేజింగ్ సామగ్రి, మరియు అనేక మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఢిల్లీలో నివసిస్తున్న ఒక నైజీరియా జాతీయుడు "నిక్" హైదరాబాద్ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ రాకెట్ కేవలం గంజాయికే పరిమితం కాకుండా, సింథటిక్ డ్రగ్స్ (MDMA) వరకూ విస్తరించిందని అధికారులు తెలిపారు.

విద్యార్థుల ప్రమేయం..
మహీంద్రా యూనివర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థులు దినేష్, భాస్కర్ నేరుగా నైజీరియా సరఫరాదారుడితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. స్టూడెంట్స్ డిజిటల్ లావాదేవీలు, నగదు డిపాజిట్ల ద్వారా చెల్లింపులు చేసి, పబ్‌లలో స్నేహితులతో కలిసి డ్రగ్స్ వాడినట్లు అంగీకరించారు. బ్యాంకింగ్ రికార్డులు కనీసం 50 మంది విద్యార్థులు ఈ లావాదేవీల్లో ఉన్నట్లు వెల్లడించాయి.
కాగా ఈగల్ బృందాలు ఒక వారం పాటు విశ్వవిద్యాలయం చుట్టూ నిఘా ఏర్పాటు చేశాయి. భద్రతా సిబ్బంది, విద్యార్థుల నుండి సమాచారాన్ని సేకరించారు. దీని ఫలితంగా ఇద్దరు విద్యార్థి డీలర్లు, వారి కొరియర్ నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలు, సరఫరా పద్ధతులు అన్నీ బయటపడ్డాయి.
అరెస్టయిన నిందితులు..
- నెవెల్ టోంగ్‌బ్రామ్ (21, మణిపూర్) - ఢిల్లీ నుండి సరుకుల సమన్వయం
- అంబాటి గణేష్ (24, జీడిమెట్ల) - స్థానిక పంపిణీ బాధ్యత
- బూస శివకుమార్ (26, బీదర్) - మార్కెటింగ్ ఉద్యోగి, గంజాయి రవాణా
- మహ్మద్ అషర్ జావేద్ ఖాన్ (21, ఢిల్లీ) - మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థి, క్యాంపస్‌లో పంపిణీ
సరఫరా విధానం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, గురుగ్రామ్ నుండి అధిక నాణ్యత గల ఓజీ వీడ్ సేకరించి DTDC, శ్రీ మారుతి, ఇండియా పోస్ట్ వంటి కొరియర్ సర్వీసుల ద్వారా పంపేవారు. బీదర్ నుండి గంజాయిని రోడ్డు మార్గంలో రవాణా చేసేవారు. వీటిని నాలుగు గ్రాముల ప్యాకెట్‌లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.500కి అమ్మేవారు. విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఓజీ వీడ్ గ్రాముకు ₹2,500 వరకూ అమ్ముడయ్యేది.

అయితే కొరియర్ కంపెనీలు పార్సిళ్లను సరిగా తనిఖీ చేయకపోవడం, విశ్వవిద్యాలయ యాజమాన్యం అనుమానాస్పద కార్యకలాపాలను పట్టించుకోకపోవడం వల్ల ఈ నెట్‌వర్క్ మరింత విస్తరించిందని అధికారులు తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌కి బానిస కావడానికి పీర్ ప్రెషర్, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, ఫాస్ట్ మనీ ఆకర్షణ ప్రధాన కారణాలు అని పేర్కొన్నారు. సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టంలోని సెక్షన్లు 8(సి), 20(బి)(2)(బి), 20(బి)(2)(ఎ), 27, 29 కింద కేసు నమోదు చేశారు.
అధికారుల హెచ్చరిక..
ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై కఠిన పర్యవేక్షణ పెట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక లావాదేవీలను క్రమం తప్పకుండా గమనించాలని సూచించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలని సిఫార్సు చేశారు. కొరియర్ కంపెనీలు అనుమానాస్పద పార్సిళ్లపై నిఘా పెంచాలని ఆదేశించారు. NDPS చట్టం ప్రకారం విద్యార్థులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని స్పష్టంగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications