'టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోకపోవడం తప్పే', 'అదే మాకు లాభమైంది'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను కలుపుకొంటే ప్రయోజనంగా ఉండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.టిఆర్ఎస్‌తో పొత్తు లేకుండా తమ పార్టీ పెద్ద తప్పు చేసిందని జీవన్‌రెడ్డి అన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి,టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. జీవన్‌రెడ్డి అలా అనగానే ముత్తిరెడ్డి వెంటనే స్పందించారు. 'మీరు కలుపుకోకపోవడంతోనే టీఆర్‌ఎస్‌ గెలిచి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింద'ని చెప్పారు

  Harish Rao Will Join Congress Party Before 2019 Elections | Oneindia Telugu

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం టిఆర్ఎస్ గెలవడమే తమకు సమస్య అయిందని జీవన్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా, ఆంధ్రోళ్ల పల్లకి మోస్తున్న రేవంత్‌ను తెలంగాణాలో తిరగనివ్వబోమని ముత్తిరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయమంటే తెలియని బీజేపీ కూడా మాట్లాడుతోందని ముత్తిరెడ్డి ఎద్దేవా చేశారు.

   Intersting conversation between Congress MLA Jeevan Reddy, TRS MLA Yadagiri Reddy

  మరోవైపు ప్రజలకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అవినీతి పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు ఆరోపించారు.అయితే టిఆర్ఎస్‌పై పోరాటం చేసేందుకు సరైన వేదిక కాంగ్రెస్‌ అని భావించి రేవంత్‌రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు.

  హరితహారంలో స్థానిక సంస్థలు పూర్తిస్థాయిలో పాలుపంచుకోలేదని సీఎం అనడం సరికాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.గ్రామీణ స్థాయిలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో స్థానిక సంస్థలకు ఒక్కపైసా విడుదల చేయలేదన్నారు జీవన్‌రెడ్డి. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం అరె్‌స్టులు చేయడాన్ని జీవన్‌రెడ్డి తప్పుబట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  There is a interesting conversation between Congress MLA Jeevan Reddy and Trs MLA M. Yadagiri Reddy at Assembly media point on Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి