వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ సెక్యూరిటీ కోర్సుల దరఖాస్తులకు ఆహ్వానం; ఆఖరుతేదీ ఇదే: NACS

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలను కట్టడి చేయడం కోసం ఎక్కడికక్కడ సైబర్ సెక్యూరిటీ అవసరం కూడా అంతే ఎక్కువగా పెరిగిపోతోంది. అనేక కంపెనీలు సైబర్ నేరాలను నియంత్రించటం కోసం సైబర్ సెక్యూరిటీని కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులకు డిమాండ్ బాగా పెరుగుతుంది.

ఇక ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) తన ఆన్‌లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్, పీజీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానం పలుకుతోంది.

Invitation to Applications for Cyber Security Courses; Last date is august 5th: NACS

సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, డిప్లొమా మరియు పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందిస్తున్నట్టు నేషనల్ అకాడమీ అఫ్ సైబర్ సెక్యూరిటీ ఒక ప్రకటనను వెలువరించింది. స్వర్ణ భారత్ నేషనల్ లెవల్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్సీ, ఎస్టీ, ఈ బిసి, ఓబిసి,మైనారిటీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు వారి పిల్లలకు కోర్సు ఫీజులో నేషనల్ అకాడమీ అఫ్ సైబర్ సెక్యూరిటీ 50 శాతం వరకు ఫీజు రాయితీని అందిస్తుంది.

వారి కోర్సు పూర్తయిన తర్వాత, అభ్యర్థులు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, సిస్టమ్స్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్స్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ అనలిస్ట్స్, ఐటి సెక్యూరిటీ ఇంజనీర్ తో పాటు మరెన్నో ఉద్యోగ అవకాశాలు పొందే చాన్స్ ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈ కోర్సుల్లో ప్రవేశానికి మరిన్ని వివరాల కోసం www.nacsindia.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. లేదా 7893141797కు కాల్ చేయవచ్చని ప్రకటించింది. ఈ కోర్సులు చేయడానికి ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆగస్టు 5 చివరి తేదీగా వెల్లడించింది నేషనల్ అకాడమీ అఫ్ సైబర్ సెక్యూరిటీ.

English summary
NACS invites online applications from Telangana candidates for admission in its online Cyber Security Courses. Interested candidates who have completed Intermediate, Degree, Diploma, Engineering, PG are invited to apply for the respective courses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X