హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునుగోడులో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ను గెలిపిస్తారా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి ప్రముఖ కాంట్రాక్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండటమే దీనికి కారణం. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన కోమటిరెడ్డితోపాటు రాష్ట్ర బీజేపీకి కూడా ఇక్కడ గెలవడం అనివార్యంగా మారింది.

కోమటిరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం!

కోమటిరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం!


మునుగోడులో గెలిస్తేనే వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడమే కాకుండా ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓటమిపాలైతే దారుణ పరాభవంగా మిగులుతుంది. అందుకే కోమటిరెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సీనియర్ రాజకీయవేత్త. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది.

కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్న 'ఐప్యాక్'

కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్న 'ఐప్యాక్'

అంతేకాకుండా అధికార టీఆర్ఎస్ కు ఎన్నికలవ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తోంది. టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్న 'ఐ ప్యాక్' కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. పీకే 'జనసురాజ్' పేరుతో బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు. తాను వ్యక్తిగతంగా రాజకీయ వ్యూహాలు అందించడం టీఆర్ ఎస్ తోనే చివరిసారి అని ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీకి పనిచేయడంలేదు. ఆయన ఆధ్వర్యంలోని 'ఐ ప్యాక్' మాత్రం పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే నియోజకవర్గంలో సర్వేను పూర్తిచేయడంతోపాటు పాల్వాయి స్రవంతికి అవసరమైన సమాచారన్ని సేకరిస్తున్నారు.

'పీకే' లేకుండా గెలిపించగులుగుతందా?

'పీకే' లేకుండా గెలిపించగులుగుతందా?

పీకే ప్రత్యక్షంగా వ్యూహకర్త నుంచి తప్పుకోవడంతో ఆయన ప్రభావం లేకుండా 'ఐ ప్యాక్' పనిచేయగలుగుతుందా? అభ్యర్థిని గెలిపించగులుగుతుందా? అనే ప్రశ్నలకు ఫలితం వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. కేసీఆర్ తో సన్నిహితంగా పనిచేసివుండటంతో ఆ పార్టీ బలాలు, బలహీనతలు పూర్తిగా తెలుసు కాబట్టి వాటిని తమదైన శైలిలో ఉపయోగించి 'ఐ ప్యాక్' స్రవంతిని గెలిపించబోతోందా? పీకే నేరుగా సలహాలివ్వనప్పటికీ పరోక్షంగా ఏమైనా అండదండలందిస్తున్నారా? అనేది తేలాలంటే నవంబరు ఆరోతేదీ వరకు ఎదురుచూడక తప్పదు.

English summary
Prashanth Kishore, who is working as an election strategist for the ruling TRS, is working for the Congress party here under the leadership of IPAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X