Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమితాబ్ జీ! అలాంటివి ఇక వద్దంటూ వీసీ సజ్జనార్ కీలక సూచన

హైదరాబాద్: గొలుసుకట్టు మోసాలు ఎక్కువవుతున్న క్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ప్రజలతోపాటు ప్రముఖులను అప్రమత్తం చేస్తున్నారు. క్యూనెట్ లాంటి సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్న సంస్థలకు ప్రచారం చేయొద్దని ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజాగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కూడా దీనిపై సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు. ఓ సంస్థ(Amway)కు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. 'గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు' అని సజ్జనార్ సూచించారు.

IPS officer and TSRTC MD Sajjanar requests Amitabh bachchan to not collaborate with fraud companies

కాగా, అమితాబ్‌ మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గొలుసు కట్ట వ్యాపారం పేరుతో ఈ కంపెనీ జనాలను మోసం చేసిందని పలు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఆమ్వే ఆస్తులను కూడా జప్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఆమ్వేకు అమితాబ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని వీసీ సజ్జనార్‌ తప్పుపట్టారు. 'అమితాబ్‌తో పాటు మిగిలిన ప్రముఖులందరికీ నాదొక విన్నపం. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది' అని సజ్జనార్ స్పష్టం చేశారు.

గతంలో ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపైనా ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో మోసాలకు పాల్పడుతున్న పలు మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. తాజాగా, కూడా కొన్ని మోసాలు వెలుగుచూడటంతో ఆయన ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+