తెలంగాణ ఐపీఎస్‌కు కేంద్రంలో కీలక పోస్ట్: ఏరివేత
NIA: తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి విష్ణు ఎస్ వారియర్‌కు కేంద్రంలో కీలక హోదా లభించింది. ఉగ్రవాదులను ఏరివేయడానికి, వారి కార్యకలాపాలను అరికట్టడానికి ఏర్పాటైన జాతీయ దర్యాప్తు సంస్థ ఎస్పీగా అపాయింట్ అయ్యారు. డెప్యుటేషన్‌పై అయిదు సంవత్సరాల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు.
2013 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విష్ణు ఎస్ వారియర్. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పని చేస్తోన్నారు. అంతకుముందు- ఆదిలాబాద్ ఎస్పీగా పని చేశారు. మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో సమర్థుడిగా గుర్తింపు పొందారు.

ఆయన సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎస్పీగా అపాయింట్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయనను రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఏర్పాటైన సంస్థ.. ఎన్ఐఏ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించిన తరువాత వారి అక్రమ కార్యకలాపాలపై ఎన్ఐఏ దృష్టి సారించిన విషయం తెలిసిందే. పీఎఫ్ఐ మూమెంట్ ఎక్కువగా ఉండే కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిఘా ఉంచింది. ఆ ఉద్దేశంతోనే కేరళకే చెందిన విష్ణు వారియర్‌ను ఈ హోదాలో నియమించిందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications