వారందరికీ రంగు పడుద్ది.. హోలీ వేళ ఐపీఎస్ సజ్జనార్ మాస్ వార్నింగ్
IPS VC Sajjanar Mass Warning: జూదం అంటేనే ఓ వ్యసనం. సరదాగా ప్రారంభమయ్యే జూదం ప్రాణాలకు మీదకు తెస్తుంది. గతంలో ఈ జూదం ఎక్కడో ఓ మారుమూల చోట జరుగుతూ ఉండేది. కానీ ఈ సాంకేతిక యుగంలో వివరీతంగా పెరిగిపోయింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు ఎన్నో కుటుంబాలను బలి తీసుకుంటున్నాడు. బెట్టింగ్ పై నిషేధం ఉన్నా కానీ ఫోన్ లో ఎన్నో బెట్టింగ్ యాప్స్ పుట్టుకురావడంతో యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసులు వాటి బారినపడుతున్నారు. చేపకు గాలం వేసినట్లుగా కొత్త కస్టమర్లకు మొదట్లో వందకు రెండొందలు.. వెయ్యికి రెండు వేలు, మూడు వేలు ఇస్తూ ఇలా మెల్లగా ఊబిలోకి లాగుతారు. ఈజీ మనీ కోసం చాలా మంది ఈ ఊబిలో మునిగి తేలుతున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లు అమాయక యువకులను టార్గెట్ గా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు. అలాంటి వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బుద్ధి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ తనదైన శైలిలో సైబర్ నేరాలపై పరిష్కారం చూపుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి చెబుతున్నారు.

హోలీ పండుగ వేళ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి రంగు పడుద్దని తన ట్వీట్ ద్వారా హెచ్చరించారు. అలాగే యువతను సజ్జనార్ ప్రశ్నిస్తూ.. మీలో ఎంత మంది బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లను గుర్తించారని.. వారిలో ఎంతమందిని బ్లాక్ చేశారని యూజర్లను తన ట్వీట్ లో ప్రశ్నించారు. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులకు ట్యాగ్ చేయండి అంటూ సజ్జనార్ సూచించారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని యువతను కోరారు.
ఇటీవల బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. పోలీసులు బెట్టింగ్ యాప్ లపై సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలోని ఇన్ఫ్లయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాలలోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ లపై ఓ కన్నెయ్యాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.
Betting apps promote cheste… రంగు పడుద్ది!#SayNoToBettingApps #Holi #HolikaDahan pic.twitter.com/lWaQSMyIl6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 14, 2025












Click it and Unblock the Notifications