హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ
వేసవి వచ్చేసింది. మార్చి మొదటి వారం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే సమ్మర్ ఎటైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) సంస్థ. అతి తక్కువ ధరకే ఈ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. దీంతో ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఊటీ అందాలను అది కూడా సమ్మర్ లో తక్కువ ధరలో ఆస్వాధించే అవకాశం ఉంది. మరి ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
దేశంలో చాలా హిల్ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ కూడా కొండలు, లోయల మధ్య ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లోనే ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిల్ స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఊటీ. వేసవిలో ఈ ప్రాంతానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు టూరిస్టులు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో వేసవిలోనే కాదు శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీకి క్యూ కడుతున్నారు. అయితే ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక ఈ టూర్ పేరు 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్' గా ఉంది. ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 17, 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంది. మీకు కావాలనుకున్న తేదీల్లో ఈ టూర్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ ప్యాకేజీలో భాగంగా పర్యటకులు ఊటీ, కున్నూర్, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం ప్రాంతాలను సందర్శించే వీలుంది.
టూర్ లో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఉంటుంది. రాత్రంతా ప్రయాణించాలి. అలా రెండో రోజు ఉదయం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్ లో బస చేసిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. తర్వాతి రోజు దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూస్తారు.
నాలుగోరోజు కూనూర్ సందర్శనకు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి. ఇక ఐదో రోజు కోయంబత్తూర్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు శబరి ఎక్స్‌ప్రెస్ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ చేయాలి. అలా ఆరో రోజు మధ్యాహ్నానికి సికింద్రాబాద్ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది.

ఇక టికెట్ ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలంటే రూ.30,060 పే చేయాలి. అలాగే ట్విన్ షేరింగ్ అయితే రూ.17,130, ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,120 ఉంటుంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టికెట్ ధర రూ.8,840 గా ఉంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.
-
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications