IRCTC అరుణాచల మోక్ష యాత్ర - కాంచీపురం సహా, 5 రోజుల షెడ్యూల్, ప్యాకేజీ..!!
ఐఆర్సీటీసీ మరో ప్యాకేజీ ప్రకటించింది. "అరుణాచల మోక్ష యాత్ర" టూర్ ప్యాకేజీని ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అరుణాచలం కు భక్తులు వెళ్తూ ఉంటారు. వీరి కోసం ఐఆర్సీటీసీ కాచిగూడ నుంచి ఈ యాత్రలో పుదుచ్చేరిలోని చారిత్రక ప్రాంతాలు, బీచ్ లో గడపటంతో పాటుగా అరుణాచలం, కాంచీపురం సందర్శించే వీలుంది. మొత్తం 5 రోజుల తీర్థ యాత్రలో భాగంగా పలు సందర్శనీయ స్థలాలను ఎంపిక చేసారు. ప్యాకేజీలో ధరలను వెల్లడించారు.
ఐఆర్సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర వ్యవధి 4 రాత్రులు/5 రోజులు గా పేర్కొన్నారు. ప్రతీ గురువారం ఈ పర్యటన ప్రారంభం అవుతుంది. IRCTC అరుణాచల మోక్ష యాత్ర ద్వారా అరుణా లం, పుదుచ్చేరి, కాంచీపురం సందర్శించే అవకాశం కల్పిస్తోంది. 5 రోజులు (4 రాత్రులు) కొనసాగే ఈ యాత్రను హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి ప్రతి గురువారం నిర్వహిస్తోంది. కాగా, ఈ ప్యాకేజీ ధరలను నిర్ధారించారు. 3AC : డబల్ షేరింగ్ 20,060, ట్రిపుల్ షేరింగ్ 15,160, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ 11,750, వితవుట్ బెడ్ 9,950 టిక్కెట్ ధర నిర్ణయించింది.

అదే విధంగా SL (స్లీపర్) : డబల్ షేరింగ్ 17,910, ట్రిపుల్ షేరింగ్ 13,460, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ 9590, వితవుట్ బెడ్ 7,800 టిక్కెట్ ధర నిర్ణయించింది. యాత్రలో భాగంగా తొలి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు (17653) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది. రెండో రోజు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుని హోటల్ చెకిన్ అయిన తర్వాత అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్ చూసి రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం అల్పాహారం చేసిన వెంటనే అక్కడి నుంచి 120కిలోమీటర్లు ప్రయాణించి తిరువన్నామలై (అరుణాచలం) చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి బస అక్కడే ఉంటుంది.
నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేశాక అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం ప్రయాణం ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వరాలయం దర్శించుకుని అక్కడి నుంచి 40 కిలో మీటర్ల దూరంలోని చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణించి 5వ రోజు ఉదయం 8గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకునే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేసారు.












Click it and Unblock the Notifications