సికింద్రాబాద్ నుంచి అయోధ్య స్పెషల్: ఏపీలో హాల్ట్ స్టేషన్లు- చాలా కవర్ అవుతాయ్
Secunderabad- Ayodhya Punyakshetra train: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య- కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. ప్రఖ్యాత బైద్యనాథ్ ధామ్ ను కూడా ఇందులో చేర్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. తొమ్మిది రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. సెప్టెంబర్ 9వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 639 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 350, 2ఏసీ- 52.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు. పూరీ- కోణార్క్- బైద్యనాథ్ ధామ్- వారణాసి- అయోధ్య- ప్రయాగ్ రాజ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
పూరీలో ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, దేవ్ గఢ్ లో బాబా బైద్యనాథ్ మందిరాన్ని సందర్శించవచ్చు. వారణాసిలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించవచ్చు. సాయంత్రం గంగా హారతిని తిలకించవచ్చు.

అయోధ్యలో చారిత్రాత్మక రామజన్మ భూమిలో వెలిసిన రామ్ లల్లా ఆలయాన్ని చూడవచ్చు. అక్కడి హనుమాన్‌గర్హి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశం. ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 17,000 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,800 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీలో (3ఏసీ) పెద్దలకు 26,700, పిల్లలకు 25,500 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీలో (2ఏసీ) పెద్దలకు 35,000, పిల్లలకు 33,300 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
Book this sacred yatra today!https://t.co/hqg8qCW3K0
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) August 7, 2025
(package Code=SCZBG46)@RailMinIndia @VisitJharkhand pic.twitter.com/6aWLrP868i












Click it and Unblock the Notifications