అల్లు అర్జున్ చెప్పేదంతా అబద్దమే?
సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందగా, ఆమె తొమ్మిదేళ్ళ కుమారుడు శ్రీతేజ్ అప్పటినుంచి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ కు గురయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరాత్రి చంచల్ గూడ్ జైలు జీవితం గడిపాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో తర్వాతరోజు ఉదయం బయటకు వచ్చాడు. బ్రెయిన్ డెత్ కు గురైన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో నాలుగోతేదీ రాత్రి నుంచి చికిత్స పొందాడు. అయితే ఈ చికిత్స ఖర్చును అల్లు అర్జున్ భరిస్తున్నాడని అతని పీఆర్ టీం ప్రకటనలిస్తోంది. వాస్తవానికి శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చును ప్రభుత్వమే భరించినట్లు తెలుస్తోంది.
ఖర్చు ప్రభుత్వం భరిస్తోంది
మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శ్రీతేజ్ బ్రెయిన్ డెత్ అవడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని, ఆ బాలుడు కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. ఈ విషయమైన ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినాతో మాట్లాడినట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా చికిత్సను సుదీర్ఘంగా అందించాల్సిన అవసరం ఉందని, త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదలవుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నామని, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

పరామర్శించిన అల్లు అరవింద్
అయితే శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చును తామే భరిస్తున్నామని అల్లు అర్జున్ టీం చెబుతోంది. ఆ బాలుడు ఆసుపత్రిలో చేరినప్పటినుంచి మొత్తం ఖర్చు భరిస్తున్నామని, అంతేకాకుండా సింగపూర్ నుంచి ఖరీదైన ఇంజక్షన్ కూడా తెప్పించామని చెబుతోంది. అయితే ప్రభుత్వమే ఖర్చు భరిస్తోందని కమిషనర్ సీవీ ఆనంద్ చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున అబద్దం ఎవరూ చెప్పరు. అలాంటప్పుడు అల్లు అర్జున్ పీఆర్ టీం అబద్దం చెబుతోందా? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్ తరఫున అతని తండ్రి అల్లు అరవింద్ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత తీరిగ్గా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఈ రెండు వారాలు ఏం చేశారు అనే విషయం వారికే తెలియాలి. బన్నీ తరఫున తాను వచ్చానని, న్యాయపరమైన అడ్డంకులు ఉండటంతో బన్నీ రావడంలేదని చెప్పారు. ఆసుపత్రి ఖర్చు ఎవరు భరిస్తున్నారు? అనే విషయంలో మాత్రం ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అల్లు అర్జున్ పీఆర్ టీంపై ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications